Atlanta, Georgia: అమెరికాలో వాసవి మాత ఆదర్శాలతో నడుస్తున్న ఏకైక సేవా సమస్త “వాసవి సేవా సంఘ్” (Vasavi Seva Sangh) ఆధ్వర్యంలో జరిగిన మరొక మైలు రాయిగా నిలిచింది వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఈ నెల ౩౦ వ తేదీన అట్లాంటా (Atlanta) లోని శ్రీ శివ దుర్గ టెంపుల్ (Sri Shiva Durga Temple) లో ఎంతో నిష్టా, గరిష్టంగా, సాంప్రదాయ బద్దంగా జరిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో భక్తులు మరియు వాసవి మాత పుత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసారు.
ముందుగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కొంత మంది భక్తులు పాడిన భక్తి గీతాలు మరియు అమ్మవారి చరిత్ర గీతం ఎంతో గానో ఆకట్టుకున్నాయి మరియు భక్తి పారవశ్యంలో ముంచేసాయి. భక్తులు అందరికి కూడా కాషాయపు కండువాలతో వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) బోర్డు సత్కరించి సరైన పూజ విధానంలో కార్యక్రము అంత కూడా ఆధ్యంతం సాంప్రదాయ పద్ధతిలో జరపడం అందరిని ఆకట్టుకుంది.
అమెరికాలో వారం మధ్యలో గురువారం రోజున జరిగిన ఈ కార్యక్రమములో చలిని సైతం లెక్కచేయకుండా వందల సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అభిషేకం, మరియు అర్చన అలంకారములతో అమ్మవారిని చూడ ముచ్చటగా, కన్నుల పండుగగా మనం ఇండియా లో ఉన్నామా అన్నట్లు శ్రీ “కార్తీక్ దీక్షిత్” (Karthik Dixit) గారి ఆధ్వరంలో అన్ని క్రతులు సాంప్రదాయ బద్ధంగా ఈ కార్యక్రమము జరిపించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో పెనుగొండ వేలకొలది భక్తులను ఆకర్షిస్తూ వుంది వాసవీ కన్యకా పర మేశ్వరీ దేవి (Vasavi Kanyaka Parameswari Temple). అక్కడ వెలిసిన వాసవీ అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్ధకమైందను కుంటారు భక్త జనకోటి. మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి, ఆత్మార్పణ రోజున అంబిక తన విశ్వరూపాన్ని చూపింది.
ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు అని భక్తులందరికీ అభయాన్ని ఇచ్చిన రోజున ఈ కార్యక్రమం జరుపుకుంటారు. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మ త్యాగం చేసిన తల్లి.. ఆ వాసవి దేవి (Vasavi Devi), వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవి దేవి త్యాగనిరతిని కొనియాడబడినది.
శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించడానికి వచ్చిన భక్తులకు (Devotees) ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారనడం అతిశయోక్తి కాదు.