Published
10 months agoon
By
NRI2NRI.COM
Atlanta, Georgia: సంక్రాంతి…. భారత దేశం లోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా పిలుచుకుంటారు. తమిళ్ నాడు లో “పొంగల్” అని, కర్ణాటక లో “సుగ్గీ” అని, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, గుజరాత్ లలో “కిచిడి పర్వ్/ఉత్తరాయణ్” అని, పంజాబ్ లో “లోహ్రీ/మాఘీ” అని, అసోం లో “భిగాలీ బిహూ/మాఘ్ బిహూ” అని , ఢిల్లీ, హరియాణా లలో “సంక్రాంతి/సక్రాత్” అని, పశ్చిమ బంగ లో “పౌష్ సంక్రాంతి” అని, ఉత్తరాఖండ్ లో “గుగుటి” అని హిమాచల్ ప్రదేశ్ లో “మాఘ సజ్జి” అని శ్రీలంక లో “ఉలావర్ తిరుణాల్” అని, నేపాల్ లో “మాఘే సంక్రాంతి” అని జరుపుకుంటారు.
ఈ తెలుగింట పెద్ద పండుగను అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారి ఆధ్వర్యం లో చిన్నారులకు భోగిపళ్లు, అక్షింతలతో, పెద్దల ఆశీర్వాదాలతో అట్లాంటా (Atlanta) లోని దేశాన మధ్య పాఠశాలలో (Desana Middle School, Alpharetta) జనవరి 18 న అట్టహాసంగా నిర్వహించారు. తామా (TAMA) వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ తెలుగు వారి గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా సర్వాంగ సుందరంగా ఉందని అందరూ మెచ్చుకొన్నారు.

వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగు వారు హాజరైన ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎన్నికైన తామా (Telugu Association of Metro Atlanta – TAMA) అధ్యక్షులు రూపేంద్ర వేములపల్లి మరియు వారి కార్యవర్గ సభ్యులతో నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ మొత్తం వేడుకకు లావణ్య (Anchor Lavanya) వాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ సంక్రాంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జార్జియా సెనెటర్ షాన్ స్టిల్ (Shawn Still), జార్జియా స్టేట్ రెప్రెసెంటేటివ్స్ టాడ్ జోన్స్ మరియు కార్టర్ బర్రెట్ (Carter Barrett) లు హాజరైనారు. సెనెటర్ షాన్ స్టిల్ మాట్లాడుతూ… మధ్య మరియు ఉన్నత తరగతి పిల్లలకు ‘సెనెటర్ పేజీ’ ఉందని, దానిలో నమోదు చేసుకొంటే, జార్జియా స్టేట్ రాజకీయాల గురించి, కాపిటల్ హిల్ లో జరిగే విషయాల గురించి తెలుస్తుందని చెప్పారు.

దీనికి హాజరయ్యే పిల్లలకు బడి లో అనుమతితో కూడిన సెలవు కూడా మంజూరు చేస్తారని చెప్పారు. కార్టర్ బర్రెట్ కార్యక్రమానికి వచ్చిన వారిని తెలుగులో ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అని పలుకరించారు. ఈ తెలుగు పదాన్ని 75 సార్లు ఉచ్చరించానని చమత్కారంగా అన్నారు. టాడ్ జోన్స్ (Todd Jones) మాట్లాడుతూ తామా సంస్థతో, తెలుగు వారితో అనుబంధం ఉందని, ఈ పండుగ ద్వారా శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తుందని ఆకాంక్షించారు.
వచ్చిన అతిధులకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చక్కని జ్ఞాపికలతో పాటు శాలువాను, పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా సత్కరించారు. హేమ తిరు ఆధ్వర్యాన ఈ కార్యక్రమం లో పిల్లలకు చిత్ర కళల పోటీలు పెట్టగా దాదాపు 5౦ కి పైగా పిల్లలు, అలాగే ముగ్గుల పోటీలలో ౩౦ కి పైగా ఆడవారు ఉత్సాహం గా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు (Prizes) కూడా ఇవ్వడం జరిగింది.

పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనే ఈ పండుగ పరమార్థం. ఈ ఉద్దేశ్యం తో ఈ సారి మొట్టమొదటి సారిగా లైఫ్ సౌత్ కమ్యూనిటీ (LifeSouth Community Blood Centers) వారితో కలిసి తామా వారు రక్త దాన శిబిరం (Blood Drive) నిర్వహించడం జరిగింది. దీనికి ముప్పై మంది రక్తదానం చేస్తారని ఆశించగా మొత్తం యాభై మందికి పైగా స్వచ్చందం గా వచ్చి రక్తదానం చేశారు.
సంక్రాంతి పండుగకు (Sankranti Festival) భారతీయ సంస్కృతి లో ఉన్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, అన్ని తరాల వారికి ప్రత్యేకంగా ఆకట్టుకునే కార్యక్రమాలు ఈ వేడుకలో భాగంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాలలో ప్రాంతీయ నాట్య పాఠశాలల ద్వారా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) కూడా ప్రదర్శించారు. పిల్లలు పండుగకు సంబంధించిన పాటలు, శ్లోకాలు , మరియు నృత్యాలను ఆడి, పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వీటిలో శిరీష రూపొందించిన నృత్యరూపకం (గ్రామీణ నేపథ్యంలో “ఆహారాన్ని వృధా చేయకూడదు, చెయ్యొద్దు” అనే సందేశంతో) బాగుందని మెచ్చుకొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు ఆరు గంటల పాటు నిర్విరామంగా కొనసాగాయి. గాయనీగాయకులు హారిక నారాయణన్ (Harika Narayan), ప్రసాద్ సింహాద్రి (Prasad Simhadri) సంయుక్తంగా శ్రోతలకింపైన పాటలు పాడి పిల్లలను, పెద్దలను సంగీత విభావరి లో ఓలలాడించారు.
పాటలకు చిన్నారులు, మహిళలు, పురుషులతో పాటు తామా బోర్డు సభ్యులు (TAMA Board of Directors) కూడా నృత్యాలు చేశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నటించిన చిత్రాలలోని కొన్ని పాటలు పాడి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తామా సంస్థ వారు పిల్లలకు అందరికీ గాలి పటాలు పంపిణీ చేశారు.

వచ్చిన వారికి తెలుగు సంప్రదాయ భోజనం (Festive Dinner) కూడా వడ్డించడం జరిగింది. వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన ముప్పై కి పైగా స్టాల్స్ (Shopping Stalls) లో ఆభరణాలు, వస్త్రాలు, ఆర్ధిక, రియల్ ఎస్టేట్ సంబంధమైన సమాచార స్టాల్స్ వంటివి విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా శేఖర్స్ రియాల్టీ, రియల్ టాక్స్ యాలీ, డబ్బావాలా, కాకతీయ ఇండియన్ కిచెన్ వ్యవహరించారు. స్పాన్సర్స్ అందరినీ సభాముఖంగా సన్మానించడం కూడా జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు రూపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli), చలమయ్య బచ్చు, సుధా ప్రియాంక సుందర, రాఘవ తడవర్తి (Raghava Tadavarthi), శేఖర్ కొల్లు, రవి కల్లి, ప్రియ బలుసు, తిరుమలరావు చిల్లపల్లి, సునీత పొట్నూరు, శ్రీనివాసరావు రామనాధం, యశ్వంత్ జొన్నలగడ్డ, కృష్ణ ఇనపకుతిక, సురేష్ యాదగిరి, నగేష్ దొడ్డాక, సాయిరాం కారుమంచి, శ్రీనివాసులు రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, సత్య నాగేందర్ గుత్తుల తదితరులు పాల్గొన్నారు.

చివరగా సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన తామా (Telugu Association of Metro Atlanta – TAMA) బృందం, స్పాన్సర్స్, అతిధులు, వాలంటీర్లు, ముఖ్య అతిధులు, పాఠశాల యాజమాన్యానికి, ఫుడ్ టీం, డెకరేషన్ టీం, డీజే టీం, SV Clicks ఫోటోగ్రాఫర్ సాయి రేగండ్ల, ప్రేక్షకులందరికీ తామా అధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

Art Competition Winners
Level 1 – KG and 1st Grade
1) Vasinya Govvala
2) Adhya K
3) Diya Reddy K

Level 2 – 2nd and 3rd Grade
1) Moksha Gandamaneni
2) Bhavika
3) Saranya

Level 3 – 4th and 5th Grade
1) Sahasra
2) Sadhu
3) Vamika Veerabomma

Level 4 – 6th and 7th Grade
1) Laasya Kanna
2) Tanya Bandari
3) Sreevatsa Yakkali

మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Sankranti 2025 Photos by SV Clicks ని సందర్శించండి.




























