హ్యాపీ కే హాయ్ జెప్పు, బాధలకే బాయ్ జెప్పు అనే వీడియో పాట ఎంతో ఆదరణ పొందుతుంది. ఈ పాటను పాడిన విధానం, మ్యూజిక్ కంపోజిషన్, కోరియోగ్రఫీ, డైరెక్షన్ అందరి మన్ననలను పొందుతుంది. ముఖ్యంగా లిరిక్స్ ప్రస్తుత జీవన సరళికి అందరికి ఆదర్శవంతంగా ఉన్నాయి.
లక్షలు ఉన్న కోట్లే ఉన్న కొనలేరు ఎవ్వరు ఆనందాలు, ఆస్తులు ఉన్న అంతస్థులు ఉన్న ఆదరించే గుణముంటే గొప్పళ్ళు అనేటువంటి పదాలు యువతకు సందేశత్మకంగా, వాళ్లలో మానసిక స్తైర్యాన్ని నింపేవిదంగా ఉన్నాయని యువత (Youth) పేర్కొంటున్నారు.
ఇంత చక్కని పాటని అమెరికాలోని అట్లాంటా (Atlanta) ఎన్నారై డా. జనార్ధన్ పన్నెల పాడి, నిర్మించి, నృత్యించి, దర్శకత్వం వహించారు. బిగ్ బాస్ ఫేమ్ గాయకులు & నటులు భోలే షావలి (Bhole Shavali) లిరిక్స్ & సంగీతం అందించగా, శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేశారు. జనార్ధన్ పన్నెల (Dr. Janardhan Pannela) తోపాటు మౌనిక డింపుల్ ఆడి పాడారు.
ఈ పాట ఇప్పటికే పల్లె వెన్నెల (Palle Vennela) ఛానల్లో లక్ష ముప్పై ఆరు వేల వ్యూస్ తో దూసుకెళుతుంది. 2025 నూతన సంవత్సరానికి విడుదల చేసిన ఈ పాట సంక్రాంతి పండుగ వైబ్స్ తో దావత్ లా అందరి మన్ననలు పొందింది. అయితే మీరు కూడా పైనున్న ఈ వీడియో పాట వైపు ఒక లుక్కేయండి.