Connect with us

News

AAA మొట్టమొదటి కన్వెన్షన్ కి రానున్న AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Published

on

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhrapradesh American Association – AAA) మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ ని 2025 మార్చి 28, 29 తేదీలలో పెన్సిల్వేనియా లోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్ పో సెంటర్ (The Greater Philadelphia Expo Center, Oaks) లో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

ఇందులో భాగంగా AAA సంస్థ స్థాపకులు హరి మోటుపల్లి మరియు అధ్యక్షులు బాలాజీ వీర్నాల ఇండియాలో పెద్దలను, ప్రముఖులను కన్వెన్షన్ కి ఆహ్వానించేపనిలో ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) ని కలిసి ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిందిగా కోరారు.

పవన్ కళ్యాణ్ కూడా AAA మొట్టమొదటి జాతీయ కన్వెన్షన్ కి వస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రణాళికలు ఇతరత్రా విషయాలు మాట్లాడుకునేందుకు తన ఇంటికి ఆహ్వానించారు. మంగళగిరి లోని జనసేన పార్టీ (Jana Sena Party – JSP) ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కి హరి మోటుపల్లి, బాలాజీ వీర్నాల AAA జ్ఞాపికను అందజేశారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) స్థాపన, విజన్, విధివిధానాలు వంటి విషయాలను కూలంకుషంగా వివరించారు. దీంతో పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) AAA నాయకులను అభినందించారు.

ఈ సందర్భంగా వీరిరువురు తమ సంతోషాన్ని తెలియజేస్తూ మాట్లాడుతూ… ఇది ఒక శుభపరిణామమని, కన్వెన్షన్ (National Convention) పై అందరి అంచనాలను పెంచేస్తుందని అన్నారు. అలాగే ఇది ఒక గౌరవంగా భావిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో AAA చాఫ్టర్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందరి మన్ననలందుకోవడం, అందునా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్వెన్షన్ కి రావడం వంటి విషయాలతో AAA సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాకుండా ప్రవాసులు సైతం ఈ జాతీయ కన్వెన్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected