Connect with us

Movies

Tollywood అనీ మాస్టర్ కి పద్మశ్రీ డా. నోరి దత్తాత్రేయుడు సన్మానం @ Sai Mandir USA, Plainview, New York

Published

on

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) జనవరి 25 శనివారం రోజున నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ (Anee Master) న్యూయార్క్‌ విచ్చేశారు.

ప్లెయిన్ వ్యూ (Plainview, New York) లోని స్థానిక సాయిబాబా గుడిని అనీ మాస్టర్ TLCA లీడర్షిప్ తో కలిసి సందరించారు. పద్మశ్రీ డా. నోరి దత్తాత్రేయుడు (Dr. Dattatreyudu Nori) అనీ మాస్టర్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మగవారికి సమానంగా టాలీవుడ్ (Tollywood టాప్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ లో అనీ మాస్టర్ పేరు సంపాదించడాన్ని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) అధ్యక్షులు సుమంత్‌ రామ్‌శెట్టి (Sumanth Ramsetti), ట్రెజరర్ అరుంధతి అడుప, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ప్రవీణ్‌ కరణం మరియు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇషిత, తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా దర్శనం, పూజ అనంతరం ఫోటోలు దిగి బయలుదేరారు.

error: NRI2NRI.COM copyright content is protected