ఈ నెల 21 న అమెరికాలోని అట్లాంటా (Atlanta, Georgia) లో YS జగన్ మోహన్ రెడ్డి (Yeduguri Sandinti Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి (Pothireddy Nagarjuna Reddy) మాజీ ప్రభుత్వ సలహాదారు P.R&R.D.AP. హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఉపన్యసించారు.
ఆయన మాట్లాడుతూ జగన్ అన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అభిమానులు మరియు విదేశంలో ఉన్న మన తెలుగు ఎన్నారైలు అత్యంత ఘనంగా జరుపుకున్నారని అందులో భాగంగా ఇక్కడ (Atlanta) కూడా అందరూ కుటుంబ సభ్యుల తో పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ (YSRCP) ఓటమి ఊహించని పరిణామం అని ఇప్పటికీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇక్కడి (Atlanta) వారి సలహాలు సూచనలను తీసుకోవడం జరిగిందని, ఈ విషయాన్ని జగనన్నకు తెలియజేయడం జరుగుతుంది అని, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని టిడిపి (Telugu Desam Party) గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదని, వారి లోపాలను, మోసాలను ప్రజలకు సోషల్ మీడియా (Social Media) ద్వారా వివరించాలని అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) 2019లో పాదయాత్రలో 3680 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎన్నికల ముందు నవరత్నాలు, పథకాలను అమలు చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు పూర్తిగా అమలు చేసిన ఘనత జగనన్నదే అని, కులం, మతం, ప్రాంతం, పార్టీ లు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు (Welfare Schemes) అన్నీ అందాయని అన్నారు.
టిడిపి (Telugu Desam Party) ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదు అని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అని, ఇప్పుడు విజన్ 2047 అని కొత్త రాగం పాడుతున్నారని ఆయన అన్నారు. మళ్ళీ జగనన్న (Yeduguri Sandinti Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి కావాలని, రావాలని ప్రజలు మరియు ఇక్కడి తెలుగు ఎన్నారైలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణ (Krishna Konakandla), దినకర్, ఉదయ్ ముఖ్య అతిథులుగా వెంకట్రామిరెడ్డి, గిరీష్ రెడ్డి (Gireesh Reddy Meka), సందీప్ తో పాటు పలువురు YSR కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) కార్య కర్తలు పాల్గొన్నారు. ఎక్కడ లేని విధంగా అమెరికా మొత్తం లోనే వందల సంఖ్యలో కార్యకర్తలు పలు పంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చెవిరెడ్డి (Chevireddy Bhaskar Reddy) NRI విభాగం ఇంచార్జి షిప్ తీసుకున్న తర్వాత మొదటి సారిగా జూమ్ మీటింగ్ లో పాల్గొని కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అంద చేశారు