Connect with us

Community Service

చలిలో పేదలు ఇబ్బంది పడకుండా NATS వింటర్ క్లోత్స్ డ్రైవ్ @ Chicago, Illinois

Published

on

Chicago, Illinois, December 19: చలి నుంచి పేదలను రక్షించేందుకు నాట్స్ (NATS) ముందడుగు. భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) నాట్స్.. చికాగోలో పేదవారి కోసం ముందడుగు వేసింది. గడ్డ కట్టే చలిలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారి కోసం వింటర్ క్లాత్ డ్రైవ్ నిర్వహించింది.

ఈ డ్రైవ్ ద్వారా చలికాలంలో వేసుకునే స్వెట్టర్లు, కోట్లు సేకరించింది. చిన్ననాటి నుంచే విద్యార్ధుల్లో సామాజిక సేవ అనేది అలవాటు చేసేందుకు ఈ వింటర్ డ్రైవ్‌ని నాట్స్ (NATS) ఎంచుకుంది. నాట్స్ చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) సభ్యులు, తెలుగు కుటుంబాలకు చెందిన వారు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌లో స్వెట్టర్లు, కోటులు, బూట్లు  విరాళంగా ఇచ్చారు.

నాట్స్ చికాగో బృందం ఇలా సేకరించిన వాటిని చికాగోలోని అరోరా, ఇల్లినాయిస్‌ (Aurora, Illinois) లో ఉన్న గుడ్ విల్ (Goodwill) సంస్థకు విరాళంగా అందించింది. గుడ్‌విల్ సంస్థ నిరాశ్రయులకు, పేదలకు చలికాలంలో వారికి కావాల్సన సాయం చేస్తుంటుంది. నాట్స్ (NATS) నిర్వహించిన వింటర్ క్లాత్ డ్రైవ్‌లో పాల్గొన్న చిన్నారులను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను సేవా పథం వైపు నడిపిస్తున్నందుకు వారిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్స్ గివిండే (Thanksgiving Day) సందర్భంగా నాట్స్ చికాగో విభాగం చేపట్టిన వింటర్ క్లాత్ డ్రైవ్‌ (Cloth drive) సామాజిక సేవలో నాట్స్ (NATS) వేసిన మరో ముందడుగు అని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అన్నారు. ఈ డ్రైవ్‌లో పాల్గొన్న నాట్స్ చికాగో బృంద సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

నాట్స్ వింటర్ క్లాత్ డ్రైవ్ కార్యక్రమాన్ని నాట్స్ చాప్టర్ (NATS Chicago Chapter) కోఆర్డినేటర్లు హవేల మద్దెల, బిందు వీడులమూడి, లక్ష్మి బొజ్జ, రోజా సీలంశెట్టి, చంద్రిమ దాడి, సిరిప్రియ బాచు, భారతి కేశనకుర్తి, భారతి పుట్ట, సింధు కాంతంనేని, ప్రియాంకా పొన్నూరు, వీర తక్కెలపాటి, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి  తదితరులు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించారు.

వింటర్ క్లాత్ డ్రైవ్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లు (Volunteers) సుమతి నెప్పలాలి, రాధ పిడికిటి, బిందు బాలినేని, రామ్ కేశనకుర్తి, పాండు చెంగలశెట్టి, ప్రదీప్ బాచు, బాల వడ్లమన్నాటి, వీర ఆదిమూలం, రాజేష్ వీడులమూడి, శ్రీకాంత్ బొజ్జ, గోపీ ఉలవ, గిరి మారిని, వినోత్ కన్నన్, అరవింద్ కోగంటిలకి నాట్స్ చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్‌కే బాలినేని, హరీష్ జమ్ముల, ఎమాన్యూల్ నీల, కిరణ్ మందాడి, రవి తుమ్మల, కిషోర్ నారె, మురళి మేడిచర్ల, రాజేష్ కాండ్రు మరియు బోర్డ్ సభ్యులుగా ఉన్న ముర్తి కోప్పాక, మహేశ్ కాకర్ల, శ్రీనివాస్ అరసాడ , శ్రీనివాస్ బొప్పాన, డా. పాల్ దేవరపల్లిలు ఈ వింటర్ క్లాత్ డ్రైవ్‌కు తమ మద్దతు, సహకారం అందించినందుకు నాట్స్ చికాగో విభాగం (NATS Chicago Chapter) ధన్యవాదాలు తెలిపింది.

error: NRI2NRI.COM copyright content is protected