Connect with us

Education

తానా ఫౌండేషన్ తోడ్పాటు: విజయవాడ, హైదరాబాద్ విద్యార్థినిలకు ల్యాప్టాప్స్ అందజేత

Published

on

అక్టోబర్ 24, 25 తారీఖులలో విజయవాడ, హైదరాబాద్ లలో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాలలో ఇద్దరు విద్యార్థినిలకు ల్యాప్టాప్స్ అందించి సహాయం చేసారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ వారు. తానా ఫౌండేషన్ తోడ్పాటు ప్రోగ్రాంలో భాగంగా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని ఆధ్వర్యంలో అక్టోబర్ 24న విజయవాడలో మందలపు శ్రీ ఆన్నపూర్ణ ఇంజనీరింగ్ విద్యార్ధినికి ల్యాప్టాప్ అందజేశారు. దీనికి దాతలు సుబ్రమణ్యం వారణాసి మరియు రాజా కసుకుర్తి.

అలాగే హైదరాబాద్ లో డిగ్రీ విద్యార్ధిని హరితంజన కు దాతలు రమణ అన్నె మరియు రాజా కసుకుర్తి సహకారంతో అక్టోబర్ 25న ల్యాప్టాప్ అందించారు. ప్రతిభగల, వెనుకబడిన విద్యార్ధులకే గాక, మానసిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్ధులను కూడా ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్న దాతలను, తానావారిని అందరూ అభినందిస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected