California: అమెరికాలో తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కాలిపోర్నియాలోని ఈస్ట్‌వేల్ (Eastvale) లో 5కే వాక్‌ధాన్ (Walkathon) నిర్వహించింది. ఈ కార్యాక్రమం లాస్ ఏంజిల్స్ నాట్స్ విభాగం వారు నిర్వహించారు. ఈ వాక్‌థాన్‌లో దాదాపు 200 మందికి పైగా తెలుగు వారు పాల్గొని దీనిని విజయవంతం చేశారు.
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ (Padma Vibhushan) రతన్ టాటా (Ratan Tata) స్మారకార్థం నిర్వహించిన ఈ వాక్‌థాన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. రతన్ టాటాలోని సేవాగుణాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాట్స్ (NATS) నాయకులు తెలిపారు. రతన్ టాటా (Ratan Tata) సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యక్రమాలను నాట్స్ నాయకులు అందరికి గుర్తు చేశారు.
ఈ వాక్‌థాన్‌కు సహకరించిన నాట్స్ (NATS) బోర్డు సెక్రటరీ మధు బోడపాటి (Madhu Bodapati), నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి (Srinivas Chilukuri), నేషనల్ కోఆర్డినేటర్లు కిషోర్ గరికిపాటి (Kishore Garikipati), రాజలక్ష్మి చిలుకూరి (Rajalakshmi Chilukuri), జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ (Manohar), మెంటర్లు హరి కొంక, వెంకట్ ఆలపాటిలకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
లాస్ ఏంజిల్స్ (Los Angeles) నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్ మురళీ ముద్దన (Murali Muddana), జాయింట్ కోఆర్డినేటర్ బిందు కామిశెట్టి (Bindu Kamisetty) ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్‌ధాన్ (Walkathon) కు శ్రీనివాస్ మునగాల, రాధా తెలగం, అరుణ బోయినేని, సిద్ధార్థ్ కోలా, శంకర్ సింగంశెట్టి తదితరులు ముఖ్య సహకారం అందించారు.
కో-ఛైర్‌లు పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి, హరీష్ అందె, ముకుంద్ పరుచూరి, శ్రీరామ్ వల్లూరి, సతీష్ యలవర్తి, అచ్చయ్య కెల్లంపల్లి, శ్యామల చెరువు, లత మునగాల తదితరుల కృషితో పాటు వాలంటీర్ల సహకారంతో ఈ వాక్‌ధాన్ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ (NATS) బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prashant Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వాక్‌ధాన్‌కు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ (Los Angeles Telugu Association – LATA) మద్దతునిచ్చింది. LATA సంస్థ ప్రతినిధులు చక్రి కావూరి (Chakri Kavuri), శ్రీనివాస్ యార్లగడ్డ, సుధీర్ పొత్తూరి, సూర్య దామోదర, హరి కలవకూరి ఈశ్వర్ అరిగేలు తమ సహకారంతో వాక్‌ధాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.