అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ గత జూన్ నెలలో 18వ మహాసభలను అట్లాంటా లో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తదనంతర పరిస్థితుల్లో ఇప్పుడు ఆటా (ATA) లో ఎన్నికల హోరు నడుస్తుంది. ఈ ఎన్నికలలో అట్లాంటా వాసి, మృదు స్వభావి శ్రీనివాస్ శ్రీరామ పోటీ చేస్తున్నారు.
ఆటా రీజినల్ కోఆర్డినేటర్ గా, రీజినల్ డైరెక్టర్ గా, మెంబర్షిప్ కోఛైర్ గా సేవలందించిన శ్రీనివాస్ శ్రీరామ (Srinivas Srirama) 18వ ఆటా కన్వెన్షన్ కోడైరెక్టర్ గా క్రియాశీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వివిధ కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ, లాజిస్టిక్స్ సమన్వయం వంటి విషయాల్లో పెద్దన్న పాత్ర పోషించారు.
కన్వెన్షన్ (18th ATA Convention & Youth Conference) కి ముందు ప్లానింగ్ మీటింగ్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు టీంకి అప్డేట్స్ ఇస్తూ దిశానిర్దేశం చేశారు. పలు క్రీడా కార్యక్రమాల నిర్వహణ, వాలంటీర్స్ కోఆర్డినేషన్, 3 రోజులపాటు వివిధ కార్యక్రమాల సమన్వయం, ఈవెంట్ మానేజ్మెంట్ వంటి పనులతో తన పర్సనల్ టైం ని సైతం కన్వెన్షన్ కి ధారపోశారు.
ఆటా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు (ATA Membership Drives) నిర్వహించి పెద్ద ఎత్తున తెలుగువారిని ఆటాలో భాగస్వాములను చేశారు. బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్, ఆర్ధిక పరమైన విషయాలకు సంబంధించి సెమినర్స్, యూత్ కార్యక్రమాలు వంటి కమ్యూనిటీ ఈవెంట్స్ నిర్వహించి అందరి మన్ననలు పొందారు.
ఇలా పలు రకాలుగా ఆటా (American Telugu Association – ATA) ప్రగతి కోసం కష్టపడిన శ్రీనివాస్ శ్రీరామ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎన్నికలలో 2025-28 సంవత్సరాలకు లైఫ్ మెంబర్షిప్ కేటగిరీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా పోటీ చేస్తున్నారు. తన సర్వీస్ రికార్డు చూసి అదర్ కాండిడేట్స్ లిస్ట్ లో ఉన్న తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు.
గత కొన్నేళ్లుగా ఆటా అట్లాంటా చాప్టర్ (ATA Atlanta Chapter) లో ముఖ్యపాత్ర పోషిస్తున్న శ్రీనివాస్ శ్రీరామ ని గెలిపిద్దాం, తద్వారా ఆటా పురోగతికి తోడ్పడదాం. డిసెంబర్ 2న పోస్ట్ ద్వారా పంపిన బాలట్స్ లో వోట్ వేసి డిసెంబర్ 20వ తేదీ లోపు తిరిగి ఆటా కి అందేలా పంపాల్సిందిగా శ్రీనివాస్ శ్రీరామ మనవి చేస్తున్నారు.