Connect with us

Community Service

30 pints రక్తదానం = 85 potential lives saved; తానా బ్లడ్‌ డ్రైవ్‌ @ New York

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) న్యూయార్క్‌ విభాగం అడ్-హాక్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 7వ తేదీన మెల్విల్ (Melville Donor Center, New York Blood Center) లో నిర్వహించిన బ్లడ్‌ డ్రైవ్‌ విజయవంతమైంది.

తానా న్యూయార్క్‌ కేర్స్‌ (TANA Cares) చైర్‌ ప్రసాద్‌ కోయి, న్యూయార్క్‌ కేర్స్‌ సెమినార్స్‌ చైర్‌ రజిత కల్లూరి ఆధ్వర్యంలో అడ్‌-హాక్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ భర్తవరపు, దిలీప్‌ ముసునూరు, యమున మన్నవ, సుచరిత అనంతనేని, హేమలత బొర్రా, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్‌ నాదెళ్ల సహాయంతో బ్లడ్‌ డ్రైవ్‌ (Blood Drive) కార్యక్రమాన్ని ప్లాన్‌ చేసి విజయవంతంగా నిర్వహించారు.

అడ్‌-హాక్‌ కమిటీ మరియు యువ వాలంటీర్లు దాతలకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం విశేషం. మొత్తంగా 30 పింట్ల (Pints) బ్లడ్‌ ను సేకరించారు. సేకరించిన బ్లడ్‌ ను అవసరమైన వారికి అందించనున్నారు.

ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చిన మద్దతు వల్లనే విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా హైస్కూల్‌ పిల్లలు వలంటీర్లుగా (Volunteers) చేసిన సేవలు మరువలేనవంటూ వారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected