Connect with us

News

సేవా కార్యక్రమాలే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా నాట్స్ Omaha చాప్టర్ ప్రారంభోత్సవం

Published

on

అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) నాట్స్ (NATS) తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓమహా (Omaha) లో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఓమాహాలోని నవాబీ హైదరాబాద్ హౌస్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఓమహాలో నాట్స్ చాప్టర్ (NATS Omaha Chapter) కోఆర్డినేటర్‌గా మురళీధర్ చింతపల్లి (Muralidhar Chintapalli) కి నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాస్ మల్లిపుడి (Srinivas Mallipudi) జాయింట్ కో ఆర్డినేటర్ పదవి వరించింది. మహిళా సాధికారిత శ్రీదేవి కమ్మ (Sridevi Kamma), విరాళాల సేకరణ, సభ్యత్వం ప్రదీప్ సోమవరపు (Pradeep Somavarapu), వెబ్ అండ్ మీడియా శ్రీనివాసరావు (Srinivasa Rao), క్రీడలు సత్యనారాయణ పావులూరి (Satyanarayana Pavuluri), కార్యక్రమాల నిర్వహణ కృష్ణ చైతన్య రావిపాటి లకు నాట్స్ (NATS) బాధ్యతలు అప్పగించింది.

మనం చేసే సేవే కార్యక్రమాలే మనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని నాట్స్ ఓమహా చాప్టర్ (NATS Omaha Chapter) సభ్యులు సరికొత్త సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) కోరారు.

నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలు మన పిల్లలతో సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని అన్నారు. ఓమహా (Omaha, Nebraska) లో తెలుగు వారిని ఐక్యం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నాట్స్ (NATS) మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల (Bhanu Dhulipalla) అన్నారు.

ఓమహాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ ఉందనే భరోసా ఇచ్చే విధంగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు (Volunteers) కృషి చేయాలని కోరారు. నాట్స్ డాక్టర్స్ హెల్ప్ లైన్ అందించిన సెకండ్ ఓపినీయన్స్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని భాను ధూళిపాళ్ల వివరించారు.

నాట్స్ (NATS) మెంబర్‌షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని (Ramakrishna Balineni) ఒమాహా బృందాన్ని అభినందించారు. ఓమహా బృందాన్ని అందరికి పరిచయం చేశారు. ఓమహాలో నాట్స్ చాప్టర్‌ను స్థానికంగా ఉండే తెలుగు వారందరిని కలుపుకుని ముందుకు సాగుతుందని నాట్స్ ఓమహా చాప్టర్ (NATS Omaha Chapter) కోఆర్డినేటర్ మురళీధర్ చింతపల్లి (Muralidhar Chintapalli) అన్నారు.

నెబ్రాస్కా విశ్వవిద్యాలయం (Nebraska University) నుండి తెలుగు ప్రొఫెసర్లు స్థానిక సంస్థల నుండి సీనియర్ తెలుగు నాయకులతో కూడిన విద్యార్థి కెరీర్ కౌన్సెలింగ్ (Career Counseling) బృందాన్ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రావుల (Srinivas Ravula) భోజన ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి శ్రీనివాసరావు మల్లిపూడి కృతజ్ఞతలు తెలిపారు. రావు చిగురుపాటి, హిందూ దేవాలయం అధ్యక్షుడు సుందర్ చొక్కర (Sundar Chokkara), ప్రొఫెసర్ డాక్టర్ ఫణిలు తమను నాట్స్ (NATS) జాతీయ నాయకత్వంలో భాగస్వామ్యం చేసినందుకు నాట్స్ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కృష్ణ చైతన్య ఈ కార్యక్రమానికి ఆడియో వీడియో సపోర్ట్‌ ను అందించారు. శ్రీదేవి కమ్మ స్టేజీ డెకరేషన్‌లో సహకరించారు. ప్రదీప్ సోమవరపు, సత్య పావులూరిలు నాట్స్ (NATS) మెంబర్‌షిప్ డ్రైవ్, నాట్స్ ప్రచారాన్ని ప్రారంభించారు. నవాబీ హైదరాబాద్ హౌస్‌తో సహా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి, ఒమాహాలోని తెలుగు ప్రజలందరికీ ఓమహా నాట్స్ చాప్టర్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected