Connect with us

Cultural

ఘనంగా దీపావళి వేడుకలు, ఆకట్టుకున్న సాంస్క్రృతిక కార్యక్రమాలు @ Washington DC

Published

on

బ్రూక్స్‌విక్ తెలుగు అసోసియేషన్ (Washington DC) ఆధ్వర్యంలో దీపావళి (Diwali) వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు (Telugu) సాంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దఎత్తున దీపాలు వెలిగించి ఆ ప్రాంతమంతా దీపకాంతులు వెదజల్లేలా అలంకరించారు.

ముఖ్యంగా మహిళలు (Women) నూతన వస్త్రాలు ధరించి కాలుష్య రహితమైన దీపావళి టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) బాగా ఆకట్టుకున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో (Telugu States) పండుగలను తలపించేలా అమెరికాలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కిశోర్ కంచర్ల మాట్లాడుతూ… తెలుగువారందరూ ఒకచోటికి చేరి అన్ని పండుగలు సాంప్రదాయబద్ధంగా జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ దీపావళి (Diwali) వేడుకల కార్యక్రమాన్ని కిశోర్ కంచర్ల (Kishore Kancharla) మరియు అరవింద యడ్లపాటి సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో రాజేశ్ కొల్లి, రూపేష్ చౌదరి కోనేరు, రమేష్ గరికపాటి, మురళీకృష్ణ ఇంటూరి, వాసు తదితరులు పాల్గొన్నారు

error: NRI2NRI.COM copyright content is protected