Connect with us

Sports

Nashville లో మొదటి ఈవెంట్, నూతన అధ్యాయానికి శ్రీకారం: TANA Appalachian

Published

on

తానా అపలాచియన్ రీజియన్ లో టెన్నిసీ (Tennessee) రాష్ట్రంలోని నాశ్విల్ (Nashville) నగర ప్రాంతం కూడా ఒక భాగం. కానీ ఇప్పటి వరకు అక్కడ తానా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి గత వారాంతం నాశ్విల్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఐపీల్ తరహా ఇనాగరల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

అందులోనూ ఇది ఫ్రాంచైసీ టోర్నమెంట్ కావడం విశేషం. ఇండియాలో లాగా ప్రొఫెషనల్ స్థాయిలో మొట్టమొదటి ఉమెన్స్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమే. నాశ్విల్ విమెన్ క్రికెట్ క్లబ్ (Nashville Women Cricket Club) తో సమన్వయం చేసుకొని తానా అపలాచియన్ విభాగం వారు ఈ నాశ్విల్ విమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు.

తానా అపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) మరియు తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి పక్కా ప్రణాళికతో ఈ మహిళల క్రీడా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నాగ (Naga Panchumarthi) ముందురోజు చార్లెట్ నుంచి వెళ్లి డల్లాస్ లో మహిళల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి, అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ నాశ్విల్ మహిళా క్రికెట్ టోర్నమెంట్ కి రావడం అభినందనీయం.

మొట్టమొదటి ఈవెంటే ఐపీల్ తరహాలో మహిళల కోసం ప్రత్యేకంగా నాశ్విల్ విమెన్ ప్రీమియర్ లీగ్ (Nashville Women Premier League) నిర్వహించడం తానా అపలాచియన్ ప్రాంతంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్టైంది. ఈ టోర్నమెంట్ కోసం నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరం నుంచి వినోద్ కాట్రగుంట కూడా విచ్చేశారు.

నాశ్విల్ విమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణలో వైభవ్ గోయల్ మరియు తానా (Telugu Association of North America) సిటీ కోఆర్డినేటర్ నవ్య కొల్లి పాలుపంచుకున్నారు. తానా ద్వారా అపలాచియన్ ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ ఈ టోర్నమెంట్ కి స్పాన్సర్ చేశారు. మ్యాచ్లన్నీ పూర్తి అయిన అనంతరం విజేతలకు, రన్నరప్స్ కి మరియు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్సమన్ లకు ట్రోఫీలు అందజేశారు.

ఈ సందర్భంగా తానా అపలాచియన్ (TANA Appalachian Region) రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ మాట్లాడుతూ… నాశ్విల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి తానా కార్యక్రమం నిర్వహించడం, అది మహిళా కార్యక్రమవడం, అలాగే పెద్ద ఎత్తున క్రీడాకారిణులు పాల్గొని విజయవంతం చేయడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు.

నాశ్విల్ విమెన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుని, ఆయా జట్ల క్రీడాకారిణులను, తానా తో సమన్వయం చేసిన నాశ్విల్ విమెన్ క్రికెట్ క్లబ్ మరియు డాజ్ స్పోర్ట్స్ (Dazz Sports) సభ్యులను, స్థానిక తానా నాయకులు, వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ రాజేష్ యార్లగడ్డ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి ప్రసంగిస్తూ… తన హయాంలో విభిన్నమైన క్రీడాకార్యక్రమాలను అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మొదటిసారి నాశ్విల్ (Nashville, Tennessee) లో మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం కొత్త అనుభూతినిచ్చిందని అన్నారు.

ఏకంగా ప్రీమియర్ లీగ్ పెట్టి ఈ స్థాయిలో విజయవంతం అవడం మామూలు విషయం కాదన్నారు. చివరిగా నాశ్విల్ లో తానా కార్యక్రమాలు ప్రారంభించడం, వ్యయప్రయాసల నోర్చి పర్సనల్ గా ఈ టోర్నమెంట్ కోసం రావడం, ఆసాంతం ఉండి మద్దతు ఇవ్వడం వంటి విషయాలలో అపలాచియన్ ప్రాంత తానా నాయకులను స్థానిక నాశ్విల్ తెలుగువారు అభినందించారు.

అపలాచియన్ ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ యార్లగడ్డ స్నేహితులయిన టెన్నిసీ తెలుగు సమితి (Tennessee Telugu Samithi) అధ్యక్షులు వంశి పోలవరపు, సాయి కోయ తదితరులను ఈ నాశ్విల్ విమెన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కలవడం జరిగింది.

విజేతల వివరాలు
విన్నర్స్: Franklin Royal Challengers
కెప్టెన్: Seema Mandlik
రన్నర్స్: Mountjuliet Mavericks
కెప్టెన్: Prathima Vallepalli

error: NRI2NRI.COM copyright content is protected