Connect with us

Cultural

TANA @ Philadelphia: సాంస్కృతిక పోటీలు విజయవంతం, ఇంద్రనీల్ & శ్రావణి ప్రదర్శనలు

Published

on

తానా మిడ్ అట్లాంటిక్ బృందం (TANA Mid-Atlantic Team) అక్టోబర్ 26న ఫిలడెల్ఫియా (Philadelphia) లో సాంస్కృతిక పోటీలను విజయవంతంగా నిర్వహించింది. గానం, నృత్యం విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 150 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాలలో జరిగిన ఈ TANA పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 600 మందికి పైగా హాజరయి పోటీలలో పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. మధ్యాహ్నం 12:30 pm కి ప్రారంభమైన పోటీలు (Cultural Competitions) విరామం లేకుండా రాత్రి 10:00 pm వరకు కొనసాగాయి.

ప్రముఖ నటుడు మరియు డాన్సర్ ఇంద్రనీల్ (Indraneel) ముఖ్య అతిథిగా విచ్చేసి శివతాండవం మరియు NBK50 మెలోడీతో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. గాయని శ్రావణి చిట్టా అతిథిగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) ఇంద్రనీల్ మరియు శ్రావణి చిట్టాలను సత్కరించారు.

అలాగే వాలంటీర్లు, దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటిల సహకారంతో సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి సాంస్కృతిక పోటీలు విజయవంతంగా నిర్వహించారు.

ఫణి కంతేటి, విశ్వనాధ్ కోగంటి, సరోజా పావులూరి, రాజేశ్వరి కంతేటి, రంజిత్ మామిడి, చందు బసుత్కర్, చలం పావులూరి, వెంకట్ గూడూరు, భవినీ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సునీత వాగ్వల, నాయుడమ్మ యలవర్తి, రవీనా తుమ్మల, నీలిమ వోలేటి, గోపి వాగ్వాల, భవాని క్రొత్తపల్లి, మనీషా మేక, గీత పొన్నగంటి, వ్యోమ్ క్రొత్తపల్లి, కృషిత నందమూరి, ధీరజ్ యలమంచి, మాన్విత యాగంటి తదితరులు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు.

error: NRI2NRI.COM copyright content is protected