ఆంధ్ర తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన అట్లతద్ది పండుగను వాషింగ్టన్ డిసి (Washington DC) మెట్రో ప్రాంతం, హేమార్కెట్ (Haymarket) లోని Lock Heart Farms లో 500 మందికి పైగా ఆహుతులతో చాలా శ్రధ్ధాభక్తులతో, ఆటపాటలతో ఎంతో సందడిగా జరుపుకున్నామని నిర్వాహకులు సుధ పాలడుగు, నవ్య ఆలపాటి, మరియు సుధ కొండపు తెలియజేసారు.
గ్రామ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రదేశం “లాక్ హార్ట్ ఫార్మ్స్” అయితే దానిని “శుభం ఈవెంట్స్” వారు అట్లతద్దిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా అలంకరించిన అందాలలో ఉయ్యాలలు, పూజా ప్రదేశం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ముందు రోజు వళ్ళెం వారి తోట నుంచి తనూజ యలమంచిలి గారు అందించిన పచ్చి గోరింటాకు రుబ్బి తద్ది పేరంటాలు అందరూ పెట్టుకున్నారు.
మరునాటి ఉదయాన్నే తద్ది తీర్చుకునే వారు, అందుకునే వారంతా ఒకేచోట కలిసి వండుకుని సూర్యోదయానికి ముందే భోజనాలు చేయడం, వైదేహి, మనోజ్, సుష్మ వ్యాఖ్యాతలుగా, DJ శశి అందించగా, సుష్మ, శ్రీవిద్య, ప్రత్యూష తదితరులందించిన సాంస్కృతిక కార్యక్రమాలతోను, గాయత్రి మరియు బృందం వారి కోలాటం, ఆటపాటలతో గడిపారు.
సాయంత్రం గీత చిలకపాటి, సహస్ర మరియు సుధా పూజ ఏర్పాట్లు చేయగా పురోహితులు మురళిగారు, కృష్ణ గారు ఉపవాసంతో తద్ది వాయనాలు తీర్చుకునేవారు మరియు తీసుకునే ముత్తైదువలందరితో ఉమా గౌరి వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా చేయించారు.
“అవ్యాన్ ఫుడ్స్” వారి అట్లబండి వద్ద వేడివేడిగా వేసిన అట్లను వాయనాలుగా ఇచ్చుకోవడం జరిగింది.
వాయనాల అనంతరం చందమామను చూసిన తరువాత గోంగూర పచ్చడి, పాయసం, పాలతాలికల్లాంటి సాంప్రదాయ పిండివంటలతో అందరూ కలసి భోజనాలు చేయడంతో వారంతా ఇండియాలోని తమ తమ బంధువులను తలపించారని వ్రతంలో పాల్గొన్న షణ్మిత, నవ్య, లక్ష్మి అపర్ణ, పద్మ, మాధురి, స్వాతి, ప్రత్యూష, రాణి, భాగ్యలక్ష్మి, స్వాతి, సుధశ్రీ వారి వారి ఆనందాలను తెలియజేసారు.
నిర్వాహకులు నవ్య, సుధారాణి మరియు సాయిసుధ మాట్లాడుతూ.. ఆనాటి పండుగలు, వేడుకల ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించేలా మేము ముగ్గురం కలసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున అమెరికాలో ఉన్న పిల్లలు, మహిళలు పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
వచ్చిన ఆహుతులందరూ తమ ఆనందాన్ని ఫోటోగ్రాఫర్స్ (Photographers) ఆషా, త్రినాథ్ మరియు నిక్కీ అందించిన ముఖచిత్రాల్లో పదిలంగా దాచుకుంటున్నామనీ, ఇలాంటి అనుభూతులనందించిన నిర్వాహకులకు (Organizers) ధన్యవాదాలు తెలియజేసారు.
అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో వేదికను అందించిన దాతలు బాబూరావు సామల, యుగంధర్ ముక్కామల, మురళి లాలుకోట గార్లకు, ఆర్థిక సహకారాన్ని అందించిన కిరాక్ ఈవెంట్స్, శ్రావణి సజ్జ, అవ్యాన్ ఫుడ్స్, Signature Collections, Paaie తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మీడియా మిత్రులు పిలుపు టివి మరియు NRI2NRI.COM వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. అనిత మన్నవ, ఇందు చలసాని, శిరీష నర్రా, అపర్ణ ఆలపాటి, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, సరిత ముల్పూరి, మల్లి నన్నపనేని తదితరులు ఈ అట్లతద్ది పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు.