Connect with us

Literary

బంగారు బతుకమ్మ

Published

on

పూల పల్లకిలో పండుగ బతుకమ్మ
తెలంగాణ గుండెల్లో వెలిగే చందమామ

చెరువుల గట్టుపై పాడే ఆడబిడ్డల పాట
విరిసిన పూలతో రంగుల బతుకమ్మ బాట

మల్లెల వాసనలతో ముద్దాడే మట్టి
చామంతుల రంగులతో అల్లిన పట్టి

పడతుల చేతులలో మెరిసే పూల గుట్ట
తెలంగాణ తల్లి గుండెల్లో చిగురించిన పుట్ట

గంగమ్మ తీరంలో సాగే పూజార్చన
గిరిజన గీతాలతో పాడే కీర్తన

ఆడబిడ్డల కళ్ళల్లో అగుపడు అందాలు
తెలంగాణ తల్లి బతుకమ్మకు వేల దండాలు

మల్లికా రెడ్డి
(సంభవామి యుగే యుగే)