Connect with us

Festivals

Andhra Kala Vedika దసరా సంబరాలలో అలరించిన స్వరార్చన @ Qatar

Published

on

మంచి మరియు చెడు మధ్య విజయాన్ని సూచిస్తూ, నవరాత్రి ఉత్సవాలతో సాంప్రదాయాలు మరియు బంధాలను పునరుద్ధరించే సందర్భంలో తెలుగు వారు చేసుకునే ముఖ్యమైన పండుగే ఈ “దసరా”. ఈ పండుగను ఖతార్ (Qatar) దేశం లోని “ఆంధ్ర కళా వేదిక” అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక “అల్ వాజ్బా బాల్ రూమ్, లా సిగాలే హోటల్” లో అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం నాడు నభూతొ న భవిష్యత్ అన్నట్లుగా నిర్వహించుకుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వరార్చన (A Tribute to SPB) ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమానికి భారతీయ రాయబార (Indian Embassy) కార్యాలయం నుండి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ సందీప్ కుమార్ గారితో పాటుగా లేబర్ ఆఫీసర్ జయ గణేష్ గారు సతి సమేతంగా విచ్చేసారు.

ప్రఖ్యాత నేపథ్య గాయని గాయకులు గీతా మాధురి (Geetha Madhuri), శ్రీ కృష్ణ, సౌజన్య భాగవతుల మరియు జయరాం (తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజేతలు) మరియు నజీరుద్దీన్ మరియు శ్రీకీర్తి (Telugu Indian Idol Season 3 Winners) బిగ్ బాస్ (Big Boss) ఫేమ్ అరియానా గ్లోరీ తో పాటు తెలుగు ఇండియన్ ఐడల్ బ్యాండ్ – సాయికుమార్, పవన్, కామాక్షి, చక్రపాణి, రామారావు, జోయెల్ మరియు నాని అందరు కలిసి తమ పాటలతో మరియు మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు.

డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ శ్రీ సందీప్ కుమార్ గారు మాట్లాడుతూ… బాష, కళ, సాంస్కృతిక మరియు సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక (Andhra Kala Vedika) కార్యవర్గ బృందాన్ని ప్రశంసించారు. కార్యక్రమాన్ని ఇంత వైభవోపేతంగా నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.

E.P. Abdurahman – ప్రెసిడెంట్, ఐఎస్సి (ISC), దీపక్ శెట్టి – వైస్ ప్రెసిడెంట్, ఐసిబిఎఫ్ (ICBF), మోహన్ కుమార్, జనరల్ సెక్రటరీ (ICC), నందిని అబ్బగొని, శంకర్ గౌడ్, AKV సలహామండలి సభ్యులు కే ఎస్ ప్రసాద్ గారు, రవీంద్ర ప్రసాద్, హరీష్ రెడ్డి, మధు, మహ్మద్ అబ్దుల్ రవూఫ్, SIGTA అవార్డ్స్ ఫౌండర్ సాధిక్ బాషా, జ్యూరీ హెడ్ వెంకట్, మణీభారతి, శ్రీధర్ అబ్బగొని, సయెద్ రఫీ, వాసు-ప్రైమ్ గల్ఫ్ జర్నలిస్ట్-బహ్రెయిన్ ఇతర తెలుగు సంఘాల (Telugu Associations) ప్రతినిధులు మరియు ప్రముఖులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ వెంకప్ప భాగవతుల (Venkappa Bhagavatula) మాట్లాడుతూ… వరుస మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్స్ తో దూసుకెళ్తున్న ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమం ద్వారా ఖతార్ లోని తెలుగువారి చరిత్రలో తొలిసారిగా లైవ్ బ్యాండ్ (Live Band) తో కార్యక్రమాన్ని నిర్వహించి మరో భారీ విజయంతో చరిత్ర సృష్టించిందని, కార్యక్రమానికి సుమారు 1200 మందికి పైగా హాజరయ్యారని, స్థలాభావం వల్ల ఎంతోమందిని అనుమతించలేకపోయామని అన్నారు.

అలాగే సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు (Sponsors)కి ప్రత్యేకించి సాచి ఈవెంట్స్ అధినేత రాధేశ్యామ్ జొన్నలగడ్డ గారికి, SPP ని రిప్రెజెంట్ చేసిన రవి కొత్తపల్లి గారికి, ఫ్లోరెంటే ని రిప్రెజెంట్ చేసిన రాజేష్ మరియు చిన్నా గారికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి (Vikram Sukhavasi), శ్రీ సుధ, శిరీష రామ్, రజని, శేఖరం రావు, సాయి రమేష్, గోవర్ధన్, మనీష్ మరియు రమేష్ దాసరి బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.

ఈ ఆంధ్ర కళా వేదిక (Andhra Kala Vedika) కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు (Volunteers) కి మరియు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇండియన్ ఐడల్ (Indian Idol) బ్యాండ్ టీం చేసిన జుగల్బందీ, చిన్నారుల నాట్యాలు, వేదిక ప్రాంగణం, కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర కళా వేదిక (Andhra Kala Vedika) ప్రధాన కార్యదర్శి శ్రీ విక్రమ్ సుఖవాసి (Vikram Sukhavasi) ముగింపు సందేశ ధన్యవాదాలతో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected