లండన్ లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు దేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం గారి లండన్ (London, England) పర్యటనను పురస్కరించుకొని మీట్ అండ్ గ్రీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది. ముందుగా పద్మభూషణ్ శ్రీరతన్ టాటా గారికి నివాళులు అర్పించి, నందమూరి తారక రామారావు (NTR) గారికి, కోడెల శివప్రసాద్ గారికి అలానే పలనాడు ప్రాంత వాసి 40 ఏళ్లుగా తెలుగుదేశమే కుటుంబం గా మెలిగిన లగడపాటి అంజిబాబు గారి చిత్రపటాలకు పూల మాలలు వేసి మననం చేసుకోవడం జరిగినది.
డాక్టర్ శివరాం గారు మాట్లాడుతూ.. మన రాష్ట్రము వంద రోజుల్లో ప్రజలలో ఇది మంచి ప్రభుత్వం అని, ప్రగతి ఎజెండా గా, మీ బిడ్డల భవిషత్తు బాగుండాలి అని చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతున్నారు అని కొనియాడారు. ప్రజల లో తెలుగు దేశం పార్టీ పట్ల, చంద్రబాబు గారి పట్ల, మన యువనాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) గారి పట్ల ప్రజల లో అపారమైన నమ్మకం వుంది అని అందుకోసం దేశం లో ఎక్కలేని విధముగా వన్ సైడ్ విక్టరీ ప్రజలు చేతిలో పెట్టారు అని కొనియాడారు.
2019 వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం పాలనలోకి రాగానే, తన పదవికి రాజీనామా అనంతరం తమ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తీసుకుని వెళ్ళమని, అధికారులకు తెలియజేసినా, కనీస సమాధానం ఇవ్వకుండా, రాజకీయ కక్ష్యలలో, 40 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవలో ఉన్న ఒక రూపాయి డాక్టర్ (Dr. Kodela Siva Prasada Rao) మీద కేసులు పెట్టి, మానసికంగా హింసించి సర్కారు ఏ విధంగా హత్య చేసింది మీ అందరికీ తెలుసు.
భగవంతుడు అనే వాడు ఎప్పుడు చూస్తుంటాడు, ధర్మం ఎప్పుడు అధర్మం పై విజయం సాదిస్తూనే ఉంటుంది. ఈ రోజు జగన్ (YS Jagan Mohan Reddy) ని చుస్తే ౩౦ కోట్లు విలువ చేసే ప్రభుత్వ సొమ్ము ఇంటిలో పెట్టుకుని, ఆనాడు కోడెల (Dr. Kodela Siva Prasada Rao) గారి పై మోపిన నిందలు తప్పుడు నిందలు అనే కనీసం పాప భీతి కూడా లేకుండా బతుకున్నాడు అని అన్నారు డాక్టర్ శివరాం.
ప్రజాస్వామ్యం లో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే మనలని అభిమానించే అభిమానులు ఎప్పుడు వుంటారు అని డాక్టర్ శివరాం (Kodela Sivaram) తెలియచేసారు. ఈ కార్యక్రమం నందు UK NRI తెలుగుదేశం పార్టీ నాయకులు లగడపాటి శ్రీనివాసరావు గారు, Dr కోగంటి రామకోటయ్య దంపతులు, యువనాయకులు రాణా, NRI టీడీపీ యూకే సీనియర్ నాయకులు గుంటుపల్లి జయకుమార్ గారు, గోగినేని శ్రీనివాస్ గారు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
ఈ Meet & Greet కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన లగడపాటి గారికి, జయకుమార్ గారికి, గోగినేని గారికి, డాక్టర్ కోగంటి దంపతులకు, రాణా కు డాక్టర్ కోడెల శివ రామ్ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, భవిష్యత్ లో NRI తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) విభాగాన్ని మరింత బలోపేతం చేయవలసిన భాధ్యత మీపై ఉన్నదని హితవు పలికి కార్యక్రమాన్ని ముగించినారు.