Connect with us

News

అడ్వెంచరస్ తానా బోట్ రేస్ విజయవంతం @ Asia Fest, North Carolina

Published

on

నార్త్ కరోలినా ఏసియా ఫెస్ట్ లో భాగంగా నిర్వహించిన బోట్ రేస్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) సభ్యులు పాల్గొన్నారు. ఏసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్ కరోలినా (Asian Focus of North Carolina) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ఏసియా ఫెస్ట్ బోట్ రేస్ లో తానా ర్యాలీ చాప్టర్ గత 5 సంవత్సరాలుగా పాల్గొంటూ వస్తుంది.

చుట్టుపక్కల పట్టణాలైన క్యారీ (Cary) మరియు మోరిస్విల్ (Morrisville) మేయర్లు, ఫస్ట్ రెస్పాండెర్స్ (Police, Firefighters) మరియు చార్లెట్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ (Charlotte Dragon Boat Association) నుంచి హేమాహేమీలు పాల్గొన్న ఈ బోట్ రేస్ లో పోటాపోటీగా తానా ర్యాలీ చాప్టర్ సభ్యులు పాల్గొనడం విశేషం.

తానా లో ముఖ్య భాగమైన టీం స్క్వేర్ (TANA Emergency Assistance Management TEAM) అందిస్తున్న సామజిక సేవలకు ఈ బోట్ రేస్ ని అంకితం చేస్తూ అందరూ ఏంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 28, శనివారం రోజున నిర్వహించిన ఈ బోట్ రేస్ (Boat Race) తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, హెల్త్ ఫెయిర్, ఫుడ్ స్టాల్ల్స్ ఏసియా ఫెస్ట్ (Asia Fest) లో భాగంగా ఏర్పాటు చేశారు.

ఒక పక్క ప్రవాసులు ఛీర్ చేస్తుండగా మరోపక్క తానా (TANA) ర్యాలీ చాప్టర్ సభ్యులు అత్యంత ఉత్సాహంగా బోటింగ్ చేశారు. ట్రూవాల్ రియాల్టీ (Truval Realty) నుంచి లక్ష్మి నరేశ్ కొసరాజు వీరికి స్పాన్సర్ చేసి మద్దతుగా నిలిచారు. అలాగే భారత్ కేఫ్ (Bharath Cafe) నుంచి చారి కంబర మరియు మహేష్ సుంకు భోజనాలు అందించారు.

తానా అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం మాదిరిగానే టీం స్క్వేర్ కి మద్దతుగా ఈ బోట్ రేస్ (Boat Race) లో పాల్గొనడం భావోద్రేకంతో కూడిన ఆనందం అన్నారు. ఈ బోట్ రేస్ ని లీడ్ చేసిన తానా బోట్ టీం కెప్టెన్ రఘు వాడుక (Raghu Vaduka) ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో తానా టీం స్క్వేర్ (TANA Team Square) ఛైర్మన్ కిరణ్ కొత్తపల్లి (Kiran Kothapalli) మరియు తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) చార్లెట్ నుంచి వచ్చి ఈ బోట్ రేస్ లో పాల్గొన్నారు. ర్యాలీ సిటీ టీం స్క్వేర్ ఛైర్ ప్రవీణ్ తాతినేని (Praveen Tatineni) ఈ కార్యక్రమానికి లాజిస్టిక్స్ విషయంలో సహాయం చేశారు.

తానా బోట్ రేస్ (Boat Race) లో పాల్గొని విజయవంతం చేసిన ర్యాలీ వాసులకు, ఎప్పటిలానే ఈ కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా నిలిచిన తానా ర్యాలీ టీం (TANA Raleigh Team) కి, వాలంటీర్స్ కి, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ తానా అపలాచియన్ ప్రాంత సమన్వయకర్త రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda) ధన్యవాదాలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected