Connect with us

Associations

అమెరికా తిరుపతిగా పిలిచే Pittsburgh లో కూడా పాగా వేసిన NATS

Published

on

Pittsburgh, Pennsylvania: అమెరికాలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తన శాఖలను విస్తరిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా అమెరికా తిరుపతిగా పేరుగాంచిన పిట్స్‌బర్గ్‌ (Pittsburgh, Pennsylvania) లో తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. నాట్స్ వెబ్ సెక్రటరీ రవి కిరణ్ తుమ్మల ఆధ్వర్యంలో పిట్స్‌బర్గ్‌లోని బెర్క్ ఫైర్ కమ్యూనిటీలో నాట్స్ విభాగ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati), ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, మార్కెటింగ్ ఉపాధ్యక్షులు భానుప్రకాశ్ ధూళిపాళ్ళ, నార్త్ ఈస్ట్ జోనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ జాతీయ మెంబర్ షిప్ అధ్యక్షులు రామకృష్ణ బాలినేని, నాట్స్ జాతీయ మార్కెటింగ్ సమన్వయకర్త కిరణ్ మందాడి, నాట్స్ షికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్ళపాటి, టాంపా బే చాప్టర్ సమన్వయకర్త భార్గవ, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీసెస్ అధ్యక్షులు అంజయ్య వేలూరు పాల్గొన్నారు.

చిన్నారి వీణ జూలూరు గణపతి స్తోత్రంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పిట్స్‌బర్గ్ నాట్స్ విభాగ (NATS Pittsburgh Chapter) ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికి అర్చన కొండపి స్వాగతం పలికారు. నాట్స్ సంస్ధ 200 మంది సభ్యులతో మొదలై ఇంతింతై వటుడింతై అని ఎదిగిన వైనాన్ని ఓ వీడియో రూపంలో ప్రదర్శించారు.

నాట్స్ తెలుగువారికి ఎలాంటి సేవలు అందిస్తుంది..? 2009 నుంచి ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి వివరించారు. అమెరికాలో తెలుగువారు నాట్స్‌లో సభ్యులు కావాల్సిన అవశ్యకతను నాట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, మార్కెటింగ్ ఉపాధ్యక్షులు భానుప్రకాశ్ ధూళిపాళ్ళ, నాట్స్ జాతీయ మెంబర్ షిప్ అధ్యక్షులు రామకృష్ణ బాలినేని, నాట్స్ జాతీయ మార్కెటింగ్ సమన్వయకర్త కిరణ్ మందాడిలు తదితరులు వివరించారు.

నాట్స్ పిట్స్‌బర్గ్ విభాగ సమన్వయకర్తగా రవి కొండపి

నాట్స్ సేవలను పిట్స్‌బర్గ్‌ (NATS) లో ముమ్మరం చేసేందుకు నాట్స్ పిట్స్‌బర్గ్ కార్యవర్గాన్ని ఈ సమావేశంలో ప్రకటించారు. నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, పిట్స్‌బర్గ్ నాట్స్ సమన్వయకర్తగా రవి కొండపి (Ravi Kondapi), ఉప సమన్వయకర్తగా శిల్ప బోయిన, పిట్స్‌బర్గ్ నాట్స్ కార్యదర్శిగా రామాంజనేయులు గొల్ల, కోశాధికారిగా శ్రీహర్ష కలగర, క్రీడల సమన్వయకర్తగా మనోజ్ తాతా, క్రీడల ఉప సమన్వయకర్తగా గిరీష్, పిట్స్‌బర్గ్ నాట్స్ యువజన సమన్వయకర్తగా నేహాంత్ దిరిశాల, ఉప సమన్వయకర్తగా రానా పరచూరి పిట్స్‌బర్గ్ నాట్స్ మహిళా, సాంస్కృతిక సమన్వయకర్తగా ప్రియ భవినేని లకు నాట్స్ బోర్డ్ బాధ్యతలు అప్పగించింది.

అలాగే నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ (NATS Pittsburgh Chapter) సలహాబృంద సభ్యులుగా హేమంత్ కె.ఎస్., అర్చన కొండపి, సాయి అక్కినేని, వెంకట్ దిరిశాల (బాబా వెంకట్), లీల అరిమిల్లి పేర్లను నాట్స్ ప్రకటించింది. టాలెంట్ స్పియర్ ఐటి సొల్యూషన్స్ అధినేత హేమంత్ రాయులు కూడా పిట్స్‌బర్గ్ చాప్టర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

పిట్స్‌బర్గ్‌లో భవిష్యత్తులో నాట్స్ చేపట్టే కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం జరిగిన పిట్స్‌బర్గ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ (Pittsburgh Premiere Cricket League) కి స్పాన్సర్స్‌గా వ్యవహరించిన నాట్స్‌కు, పిట్స్‌బర్గ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ నిర్వహకులు సుమంత్, మనోజ్ తాతాలు ధన్యవాదాలు తెలిపారు.

ఇంతటి మంచి కార్యక్రమానికి గ్రాండ్ స్పాన్సర్స్ గా తమ సహకారాన్ని అందించిన టాలెంట్ స్పియర్ ఐటి సొల్యూషన్స్ అధినేత హేమంత్ రాయులుకి, పుడ్ స్పాన్సర్స్ మింట్ యాజమాన్యం హరీష్ గంటా, మనోజ్ కొమ్మినేని, సూరి రచ్చా, శ్రావణ్ గుండేలకు, పిట్స్‌బర్గ్‌లో ప్రముఖ రియల్టర్ ప్రశాంత్ నంద్యాల, లక్ష్మి మహాలి దంపతులకు నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, రవి కొండపి తమ ధన్యవాదాలు తెలిపారు.

పిట్స్‌బర్గ్ నాట్స్ విభాగ (NATS Pittsburgh Chapter) ప్రారంభోత్సవానికి సాంకేతిక సహాయ సహకారాలను (Technical Support) అందించిన నాట్స్ ఈసీ మీడియా టీం నుండి మురళి మేడిచెర్ల, కిషోర్ నారె, సంకీర్త్ కటకం లకు నాట్స్ పిట్స్‌బర్గ్ విభాగం సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యాఖ్యతలుగా వ్యవహరించిన అర్చన కొండపి, శ్వేత గుమ్మడి, ఫోటోగ్రపీకి వాలంటీరుగా ముందుకొచ్చిన కుమారి శర్వాణికి, గణపతి స్తోత్రం ఆలపించిన చిన్నారి వీణ జూలూరు మరియు తదితరులను నాట్స్ (North America Telugu Society) నాయకులు అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected