Atlanta, Georgia: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఈ మధ్యకాలంలో అమెరికా అంతటా అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. అట్లాంటా నాట్స్ విభాగం (NATS Atlanta Chapter) పురుషుల, మహిళల విభాగాల్లో ఈ పికిల్ బాల్ టోర్నమెంట్ ని సెప్టెంబర్ 29 ఆదివారం రోజున నిర్వహించింది.
ఈ టోర్నమెంట్‌ల్లో మొత్తం 52 జట్లు పోటీ పడ్డాయి. అట్లాంటా తెలుగు సంఘాల (Atlanta Telugu Associations) చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించిన పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) ఇదే మొదటిది కావడం గమనార్హం. నాట్స్ అట్లాంటా లో ఆవిర్భించిన తొలినాళ్లలోనే ఇంత పెద్ద టోర్నమెంట్లను దిగ్విజయంగా నిర్వహించడంపై స్థానిక తెలుగు క్రీడాకారులు (Sportsmen) ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ టోర్నమెంట్ల విజయంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్ల పాత్ర మరువలేనిదని నాట్స్ అట్లాంటా చాప్టర్ (NATS Atlanta Chapter) కో ఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి అన్నారు. అట్లాంటా నగర చరిత్రలోనే మొట్ట మొదటి పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించటం, అది ఇంతటి ఘన విజయం సాధించటం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో అట్లాంటా (Atlanta) లో నాట్స్ సేవా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
టోర్నమెంట్ల ముగింపు కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేష్ పెద్ది (Suresh Peddi), అట్లాంటా చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ రజిని మాదాల, చాప్టర్ సెక్రటరీ నాగరాజు మంతెన, దుష్యంత్ నర్రావుల, శ్రీనివాసరావు యడ్లపల్లి, గౌతమ్ రెడ్డి గాదిరెడ్డి, శిల్పా కోనేరు, శశిధర్ ఉప్పల, రంజిత్ కుమార్ గుజ్జర్లపూడి, హితేష్ చింత, రేష్మా ఫర్హీన్, అభిలాష్ ఏడుపుగంటి, విద్య కాట్రగడ్డ, శశాంక్ చదలవాడ, లోహిత్ మంతెన తదితరులు పాల్గొన్నారు.
ఈ NATS పికిల్ బాల్ టోర్నమెంట్లలో (Pickleball Tournaments) 52 జట్లు వివిధ కేటగిరీల్లో పోటీ పడ్డాయి. అడ్వాన్స్ క్యాటగిరిలో ఏసెస్ జట్టు విజయం సాధించింది. పికిల్ టిక్లర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బిగినర్స్, ఇంటర్మీడియట్ కేటగిరి నుండి ఎన్.సి.టి టీం విజేతగా, బ్రూక్ వ్యూ బ్రదర్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.. అలాగే సెమీ-ఫైనల్ రన్నరప్ క్యాటగిరి నుండి రాయల్ చాలెంజర్స్ జట్టు విజేతగా మౌంటైన్‌క్రస్ట్ మాన్ట్సర్స్ జట్టు రన్నప్‌గా నిలిచాయి.
పికిల్ బాల్ టోర్నమెంట్లను అద్భుతంగా నిర్వహించిన అట్లాంటా చాప్టర్ జట్టుని నాట్స్ సలహా మండలి సభ్యులు సతీష్ ముసునూరి (Satish Musunuri), శ్రీకాంత్ వల్లభనేని (Srikanth Vallabhaneni), హరి కరియావుల ప్రశంసించారు. చాప్టర్ కోఆర్డినేటర్ వెంకట కృష్ణ మాలపాటి, శశి ఉప్పల, హితేష్ చింత, రంజిత్ గుజ్జర్లపూడి, స్పోర్ట్స్ టీం నుండి శ్రీనివాస్ ఎడ్లవల్లి, గౌతం రెడ్డి గాదిరెడ్డి తదితరులు చేసిన కృషి వారు ప్రత్యేకంగా అభినందించారు.
పికిల్‌బాల్ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రోత్సాహం అందించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) కి అట్లాంటా చాప్టర్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్లు విజయవంతం కావటంలో తమ వంతు సహాయం అందించిన నాట్స్ (NATS) సెక్రటరీ రాజేష్ కండ్రు, నాట్స్ ఈసీ వెబ్ టీం నుండి రవికిరణ్ తుమ్మల, నాట్స్ ఈసీ మీడియా టీం నుండి మురళి మేడిచర్ల, కిషోర్ నారె, సంకీర్త్ కటకం లకు అట్లాంటా నాట్స్ విభాగం ధన్యవాదాలు తెలిపింది.