ఈ మధ్యనే వచ్చిన వరదల తాకిడికి గురైన ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండలం లోని రెండు గ్రామాలు కాలువ వలన వచ్చిన వరదలతో ఇబ్బంది పడ్డారు.
రెండు గ్రామాలలోని రైతులకు పాడిపంటల విషయంలో సహాయపడాలనే సదుద్దేశంతో తానా (TANA) ఫౌండేషన్ వారు పశువుల దాణా (Cattle Feed) ని ఉచితంగా పంపిణీ చేశారు. ట్రాక్టర్లలో తీసుకెళ్ళి రైతులకు అందజేశారు. వరదల సమయంలో చేసిన ఇతర సహాయాన్ని సైతం గుర్తు చేస్తూ తానా ఫౌండేషన్ (TANA Foundation) అందించిన మద్దతు మరియు సహకారం మరువలేనిది అన్నారు రైతులు.
దేశానికి రైతులే (Farmers) వెన్నెముక అంటూ కష్టకాలంలో గ్రామాల పునర్నిర్మాణంలో లో భాగంగా సహాయం చేస్తున్నారంటూ రైతులు తానా (Telugu Association of North America) ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) సారధ్యంలోని తానా ఫౌండేషన్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.