ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి (Andhra Pradesh Chief Minister Relief Fund) తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 లక్షలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని ఆయన కార్యాలయంలో కలిసి 25 లక్షలు చెక్కును అందించారు.
ఇటీవల భారీ వర్షాల (Floods) నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించినట్లు తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య తెలిపారు. తమ కుమారులు ప్రవాస భారతీయులు డాక్టర్ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ, తానా (TANA) మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయ శేఖర్ (Jayasekhar Talluri) సౌజన్యంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు.
మునుముందు మరింత సహకారం అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ వల్లూరుపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తూము రామిరెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల (Flood Victims) కోసం సహాయం అందించిన ట్రస్ట్ బాధ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అభినందించారు.