భారతీయ విశిష్ట పండుగ దీపావళి (Diwali) పండుగను అధికారికంగా గుర్తించడంతోపాటు, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి వారంగా గుర్తిస్తున్నట్లు నెబ్రాస్కా రాష్ట్ర గవర్నర్ (Nebraska State Governor) జిమ్ పిల్లెన్ (Jim Pillen) కార్యాలయం ప్రకటించింది. అలాగే అక్టోబర్ నెలను నెబ్రాస్కా రాష్ట్రంలో హిందూ హెరిటేజ్ మాసం (Hindu Heritage Month) గా కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.
తరతరాలు గా వస్తున్న హిందూ (Hindu) సాంస్కృతిక వారసత్వం, సనాతన ధర్మం, సంస్కృతి మరియు సంప్రదాయాల పరిరక్షణతోపాటు దీపావళి వేడుకలను (Diwali Celebrations) ఉల్లాసంగా జరుపుకోవడం కోసం అమెరికాలోని భారతీయ హిందూ సంఘం చేసిన గొప్ప కృషి వల్ల ఇది సాధ్యమైంది.
నెబ్రాస్కా రాష్ట్రం (Nebraska State) లోని హిందూ సోదరులంతా దీపావళి వేడుకలను మరియు హిందూ వారసత్వ నెల ఉత్సవాలను మీ కుటుంబంతో, స్నేహితులతో పాటు కమ్యూనిటీతో ఘనంగా జరుపుకోవాలని హిందూ (Hindu) నాయకులు కోరారు. అధికారికంగా ప్రకటన రావడం పట్ల పలువురు కమ్యూనిటీ నాయకులు (Community Leaders) సంతోషం వ్యక్తం చేశారు.
నెబ్రాస్కా స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ లింకన్ (Nebraska State Capitol Building Lincoln) లో వార్నర్ లెజిస్లేటివ్ ఛాంబర్ (Warner Legislative Chamber) లో జరిగిన సమావేశంలో భారతీయ సంస్కృతీ గొప్పతనాన్ని తెలియజేస్తూ, దీపావళి పండుగ (Diwali Festival) ప్రాముఖ్యతపై ప్రసంగించిన డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం (Dr. Phani Tej Adidam) గారికి హిందువుల తరపున హృదయ పూర్వక ధన్యవాదములను తెలియజేశారు.
అలాగే అధికారికంగా ఈ ప్రత్యేక గుర్తింపు తీసుకురావటానికి మల్లికా జయంతి, కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, వెంకట్ జయంతి, రాజా కోమటిరెడ్డి, టాటారావు కోసూరి, అనిల్ పోతినేని, తపన్ దాస్, శైలేందర్, అరుణ్ కుమార్ పాండిచ్చేరి, దేవిక పాండిచ్చేరి, మాధవి, పీయూష్ శ్రీవాస్తవ్, ప్రవీణ్ గుమ్మడవల్లి, శ్రీపత్ కాంబ్లే, రామకృష్ణ కిలారు తదితరులు విశేషంగా కృషి చేశారు.