Naperville, Chicago, August 25, 2024: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తెలుగువారు అధికంగా ఉండే నాపర్విల్, చికాగో (Naperville, Chicago) లో మొదటిసారి ఆగష్టు 24న పికిల్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ చికాగో విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన లభించింది.
150 మందికి పైగా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్‌ని తొలిసారి నిర్వహించిన నాట్స్ చికాగో విభాగం సభ్యులను, క్రీడాకారులను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) అభినందించారు. తెలుగువారిని కలిపేందుకు ఇలాంటి ఆటల పోటీలు దోహదం చేస్తాయని మదన్ పాములపాటి అన్నారు.
నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ చికాగో(Chicago) పికిల్ బాల్ టోర్నమెంట్‌ను చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించిన చికాగో చాప్టర్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ఎక్కుర్తిని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
నాట్స్ చికాగో విభాగం (NATS Chicago Chapter) నాయకులు సిరి బచ్చు, భారతి కేసనకుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, నరేంద్ర కడియాల, మహేష్ కిలారు, గోపి ఉలవ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినందుకు వారిని నాట్స్ జాతీయ నాయకులు ప్రశంసించారు.
ఈ టోర్నమెంట్‌కు (Pickleball Tournament) కావాల్సిన సౌకర్యాలు, వేదిక, ఆహారం ఏర్పాటు చేసిన నాట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, కార్య నిర్వాహక సభ్యులు ఆర్.కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన తదితరులను నాట్స్ (NATS) నాయకత్వం అభినందించింది.
విజేతల వివరాలు
కిడ్స్ కేటగిరీ
విన్నర్స్: సోహాన్ & అలోక్
రన్నర్స్: బహి & ధృవ్
ఇంటర్మీడియట్ కేటగిరీ
విన్నర్స్: బాల & సుమంత్
రన్నర్స్: దినేష్ & అంకిత్
అడ్వాన్స్డ్ కేటగిరీ
విన్నర్స్: ఎలిజా & సంజయ్
రన్నర్స్: కిరణ్ & మహి