తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) వారు 2024 ఆగస్ట్ 31, శనివారం రోజున 4:30 pm నుంచి 8:30 pm వరకు తెలుగు కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ది క్రాస్ రోడ్స్ ఆఫ్ ది వరల్డ్ గా పిలవబడే విశ్వనగరం న్యూయార్క్ (New York) లోని టైమ్స్ స్క్వేర్ (Times Square) వేదిక కానుంది.
మన తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారాలు, భాష ప్రధాన అంశాలుగా ఈ తెలుగు కల్చరల్ ఫెస్టివల్ (Telugu Cultural Festival) నిర్వహించనున్నారు. టైమ్స్ స్క్వేర్ (Times Square) నుంచి టీవీ9 లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆహ్వానితుల సౌకర్యార్థం బస్సు సదుపాయం కలదు. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలకు (Cultural Programs) విపరీత స్పందన రావడంతో రెజిస్ట్రేషన్ క్లోజ్ చేశారు.
న్యూయార్క్ (New York) చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ పాల్గొని తెలుగు కల్చరల్ ఫెస్టివల్ ని విజయవంతం చేయవలసిందిగా తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) సారధ్యంలోని TLCA కార్యవర్గ సభ్యులు మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కోరుతున్నారు.