Guntur, Andhra Pradesh: వాషింగ్టన్ డీసీలో GWTCS స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Chandra Sekhar Pemmasani) ను సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్, గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావుతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆహ్వానపత్రికను అందజేశారు.
సెప్టెంబర్ 27, 28 తేదీల్లో GWTCS (Greater Washington Telugu Cultural Sangam) గోల్డెన్ జూబ్లీ వేడుకలు (Golden Jubilee Celebrations) జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా కోరారు. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.
దేశంలో ఉన్న ఆస్తులకు రక్షణ కల్పించాలని, అవి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత YSR Congress Party ప్రభుత్వ హయాంలో అందరి ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. ప్రవాసాంధ్రుల (NRIs) సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని పెమ్మసాని (Chandra Sekhar Pemmasani) తెలిపారు.
ఈ కార్యక్రమంలో Greater Washington Telugu Cultural Sangam (GWTCS) సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) తోపాటు గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), సామినేని కోటేశ్వరరావు, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఘంటా పున్నారావు, వడ్లమూడి నాగేంద్రం, రాయపాటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.