ఉగాది భోజనంబు వింతైన వంటకంబు… వాట్స్ వారి విందు సియాటిల్ వారికే ముందు… అంటూ ఉగాది వేడుకలతో మీ ముందుకొస్తున్నారు మన వాషింగ్టన్ తెలుగు సమితి కార్యవర్గం. ఈనెల మార్చ్ 24న స్థానిక బెల్వ్యూ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం రెండు గంటలనుండి రాత్రి తొమ్మిది గంటలవరకు మిరిమిట్లు గొలిపే సాంస్కృతిక కార్యక్రమాలతో, పసందైన ఉగాది విందు భోజనాలతో, గాయనీ గాయకులు శిల్పారావు మరియు నరేంద్ర గార్ల పాటల హరివిల్లుతో మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కావున తామెల్లరు త్వరగా టికెట్స్ కొనవలసిందిగా మనవి. http://www.watsweb.org