Connect with us

News

భారత కాన్సులేట్ అధికారులతో నాట్స్ బృందం సమావేశం @ Atlanta

Published

on

Atlanta, జులై 2, 2024: అట్లాంటా లోని భారత కాన్సులేట్ అధికారి రమేశ్‌ బాబు లక్ష్మణన్ తో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) నాయకులు సమావేశమయ్యారు. నాట్స్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా అట్లాంటా భారత కాన్సులేట్ (Consulate General of India, Atlanta) కార్యాలయ అధికారులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

అట్లాంటాలో అన్ని ఆర్గనైజషన్స్ కలిసి పెద్ద ఎత్తున దీపావళి (Diwali) పండుగ ఈవెంట్ నిర్వహిస్తే బాగుంటుందని, ఆ దిశగా నాట్స్ అట్లాంటా చాప్టర్ (NATS Atlanta Chapter) సభ్యులు ముందడుగు వేయాలని కోరారు. కాన్సులేట్ నుంచి తాము కూడా పాస్పోర్ట్, వీసా, ఓ సి ఐ కార్డ్ వంటి ప్రభుత్వ సేవల్లో స్పీడుగా స్పందించేలా కృషి చేస్తున్నామన్నారు.

నాట్స్ హెల్ప్ లైన్, అమెరికాకు వచ్చే విద్యార్ధులకు చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన, గృహహింస బాధితులకు అండగా నిలబడటం, మానసిక పరిణితి పెంచేలా సదస్సులు, ప్రతిభ గల విద్యార్ధులకు పురస్కారాలు, స్థానిక కమ్యునిటీ సేవలు ఇవన్నీ నాట్స్ ఎలా చేస్తుంది..? అమెరికాలో తెలుగువారికి ఎలా అండగా నిలబడుతుందనే విషయాలను కాన్సులేట్ అధికారులకు వివరించారు.

ఈ ఇండియన్ కాన్సులేట్ (Consulate General of India, Atlanta) అధికారుల సమావేశంలో నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సురేశ్ పెద్ది (Suresh Peddi), నాట్స్ (NATS Atlanta Chapter) అట్లాంటా చాప్టర్ సభ్యులు అభిలాష్ ఈడుపుగంటి, రాజ్ చావా, శశిధర్ ఉప్పల తదితరులు పాల్గొన్నారు.

ప్లోరిడా (Florida) లో కూడా భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించే కార్యక్రమాల్లో నాట్స్ (NATS) చురుకుగా పాల్గొంటుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు. భారత రాయబార కార్యాలయంతో తమ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనే నమ్మకాన్ని ప్రశాంత్ వ్యక్తం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected