Connect with us

Celebrations

ఘనంగా కూటమి విజయోత్సవం, రామోజీ రావు కు ఘన నివాళి @ Jericho, New York

Published

on

అమెరికా లోని న్యూ యార్క్ (New York) నగరంలో తెలుగు తమ్ముళ్లు మరియు NDA సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికి విదితమే.

ఈ సందర్బంగా జూన్ 23 న న్యూ యార్క్ (New York) నగరం లోని జేరికో (Jericho) పట్టణంలో వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి కలసి పెద్దల సహకారంతో వేడుకలు (Victory Celebrations) ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలలో వక్తలు డా. తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరావు బొడ్డు, అంజు కొండబోలు, డా. జగ్గారావు అల్లూరి, డా. పూర్ణచంద్రరావు అట్లూరి, డా. కృష్ణరెడ్డి గుజవర్తి, తానా (TANA) మాజీ ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి పాల్గొన్నారు.

ఆర్గనైజర్లు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి జరిగిన అన్యాయాన్ని, కొత్త ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, బాధ్యతను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు (Nara Chandrababu Naidu) అన్ని పనులు చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈనాడు రామోజీ రావు కి ఘన నివాళి

మీడియా మొఘల్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, ఎందరో కళాకారులకి, విలేకరులకు జీవితాన్నిచ్చిన శ్రీ చెరుకూరి రామోజీ రావు (Cherukuri Ramoji Rao) గారికి ఘన నివాళ్ళులు అర్పించారు. అయన తెలుగు స్మరించుకుంటు సందేశం ఇచ్చారు. అయన ఆత్మాకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected