‘నేల ఈనిందా.. ఆకాశం చిల్లు పడిందా..’ అన్న ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) నోటి నుంచి ఈ డైలాగ్ రాగానే మైదానమంతా పావుగంట సేపు దిక్కులు పిక్కటిల్లేలా కరతాల ధ్వనులు..నినాదాలు. ‘జనం.. జనం.. ప్రభంజనం..’
అన్న ఎన్టీఆర్ (NTR) చైతన్య రథం మీద బయలుదేరగానే జనాలు గ్రామాలకు గ్రామాలు పొలం పనులు కూడా పక్కనపెట్టి రోడ్ల మీదకు చేరి ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. చరిత్ర.. చరిత్ర సృష్టించబడింది.. కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party) ని కూకటి వేళ్ళతో పెకలించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి (Chief Minister) పదవిని అధిష్టించారు.
ఆ మహానుభావుడి 101వ జయంతి వేడుకలను బే ఏరియా (Bay Area) లో ఈ రోజు తెలుగుదేశం సీనియర్ నాయకుడు జయరాం కోమటి (Jayaram Komati) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సానుభూతిపరులు పలువురు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంకోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వెళ్ళి వారివారి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చారు. జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త భల్లా తమ అనుభవాలను వచ్చినవారితో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం (Telugu Desam Party) నాయకులు, జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త భల్లా, సతీష్ అంబటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ళ, రవి కిరణ్, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గోన్నారు.