అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ (NATS) తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఆటిజం బాధితుల కోసం ఆటిజం కేర్ ఆన్ వీల్స్ (Autism Care on Wheels) పేరిట ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసింది.
ఆటిజం (Autism) బాధితులకు, దివ్యాంగులకు సేవలు అందించే స్పర్శ ఫౌండేషన్‌కు ఈ వాహనాన్ని అందించింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఆటిజం (Autism) బాధితుల కోసం ఏదో ఒక్కటి చేయాలనే సంకల్పంతో నాట్స్ డల్లాస్ (Dallas) కోఆర్డినేటర్ రవి తాండ్ర చూపిన చొరవ ప్రశంసనీయమని బాపు నూతి ప్రశంసించారు.
దివ్యాంగులకు అండగా నిలవాలన్న సామాజిక బాధ్యత (Social Responsibility) మనందరికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర (Ravi Tandra) తమ కోసం సమయం, ధనం వెచ్చించి చేస్తున్న సేవా కార్యక్రమాలను అఖిల భారత దివ్యాంగుల సంఘం నాయకులు కొల్లి నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
ఆటిజం (Autism) బాధితుల కోసం అటు అమెరికాలో నాట్స్ (North America Telugu Society) ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. దివ్యాంగుల కోసం నాట్స్ నాయకులు చేస్తున్న కృషిని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేకంగా అభినందించారు.