Connect with us

Financial Assistance

దివ్యాంగునికి స్వశక్తితో ఎదిగేలా NATS చేయూత @ Nizamabad, Telangana

Published

on

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా తెలంగాణ (Telangana) రాష్ట్రం, నిజామాబాద్‌లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది.

హోప్ ఫర్ స్పందన (Hope4Spandana) తో కలిసి నాట్స్ (North America Telugu Society) దివ్యాంగుడు కిరణా దుకాణం పెట్టుకునేందుకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసింది. నాట్స్ అధ్యక్షుడు (NATS President) బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి ఈ కిరణా దుకాణాన్ని ప్రారంభించి ఆ దివ్యాంగుడికి భరోసా ఇచ్చారు.

తెలుగు (Telugu) రాష్ట్రాల్లో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ (NATS) అధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూత ఈ సమాజం అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు.

హోప్ ఫర్ స్పందన (Hope4Spandana) దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆ సంస్థతో కలిసి తాము కూడా చేతనైన సాయం చేస్తున్నామని బాపు నూతి తెలిపారు. దివ్యాంగుల సమస్యలను తమ దృష్టికి తెచ్చి వారికి చేయూత అందించడంలో తమను భాగస్వాములు చేసిన హోప్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected