Connect with us

Cultural

Atlanta: అబ్బురపరిచిన చిన్నారుల ప్రదర్శనలు @ మనబడి పిల్లల పండుగ, Silicon Andhra

Published

on

భాషాసేవయే బావితరాల సేవ అను నినాదంతో సిలికానాంధ్ర సంస్థ అమెరికా లోని పలు రాష్ట్రాలలో తెలుగు భాషను నేర్పించుటకు మనబడి తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి 24న అట్లాంటా (Atlanta) లోని కమ్మింగ్, మారియెట్టా, డన్వుడి మరియు రివర్డేల్ (Silicon Andhra) మనబడి పిల్లలు సుమారు 260 మంది బాలబాలికలు పిల్లలపండుగ వేడుకలో పాల్గొని అద్భుతమైన, అబ్బురపరిచే ప్రదర్శనలు ఇచ్చారు.

కమ్మింగ్ (Cumming) సమన్వయకర్తలు గౌరీధర్ మాడు (Gowridhar Madu) గారు, సుచేత గారు ఎంతో ప్రణాళిక తో కార్యక్రమానికి కావలిసిన సదుపాయాలను అమర్చారు. ఒకవైపు నగరంలో హోలీ పండుగ కార్యక్రమాలు అదే రోజు జరుగుతున్నా సరే, దాదాపు 1000 మందికి పైగా స్థానిక తెలుగువారు తల్లితండ్రులు West Forsyth High School లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యి పెద్ద వేడుకలా జరుపుకున్నారు.

ముందుగా ప్రాంతీయ సమన్వయకర్త విజయ్ రావిళ్ల (Vijay Ravilla) గారు తెలుగు భాష ప్రాముఖ్యత, అట్లాంటా మనబడి ప్రస్థానం, భవిష్యత్తు కార్యాచరణ, గురించి తెలియజేశారు. తదుపరి కమ్మింగ్ సమన్వయకర్త గౌరీధర్ మాడు గారు ఆనవాయితీగా వస్తున్న భాషా జ్యోతి కార్యక్రమ ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ, అతిథిగా విచ్చేసిన విద్యా తపస్వి మామిళ్ళ వెంకట రంగయ్య లోకనాథం గారి ద్వారా, సమన్వయకర్త సుచేత కాంచనపల్లి చేతుల మీదుగా భాషా జ్యోతిని బాలబడి చిన్నారులకు అందచేశారు.

తదుపరి అన్ని తరగతుల విద్యార్థులు 260 మంది వివిధ రకాల ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. పిల్లలు తమకు భాష మీద ఉన్న పట్టును తెలుగు బాల శతక, పోతన పద్యాలు, బుఱ్ఱ కథ, పరమానందయ్య శిష్యుల కథ, భువన విజయం, ఋతువులు పండుగలు, పర్యావరణ సంరక్షణ, పిల్లుల తగవులు వంటి నాటికలు, చిట్టి చిట్టి మిరియాలు, ఆటలంటే మాకు ఇష్టం, తేనెల తేటల మాటలతో వంటి పాటలు ప్రదర్శించారు.

అంతే కాకుండా సరస్వతీ దేవి ప్రార్థనా గీతం, స్వాగత నృత్యం, దశావతారం నాటిక, జానపద నృత్యాలు (అడవి తల్లి, డప్పు, కోలాటం, బోనాలు, ధింసా, లంబాడి ), తెలుగు భాష (Telugu Language) తీయదనం వంటి నృత్యాలతో తమకు మన సంసృతి, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శించారు.

మొట్టమొదట నుండి అట్లాంటా (Atlanta) లో మనబడి స్థాపనకు, అభివృద్ధికి సహాయపడుతున్న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సహాయక బృందం (నగేష్ దొడ్డాక గారు, వెంకి గద్దె గారు, యశ్వంత్ జొన్నలగడ్డ గారు, గౌరి గారు, తిరు చిల్లపల్లి గారు), సిలికానాంధ్ర సభ్యురాలు జ్యోతి చింతలపూడి గారిని వేదిక మీదకు పిలిచి పుష్ప గుచ్చ్చాలతో సత్కరించారు.

వారిచే (Silicon Andhra) మనబడి సమన్వయ కర్తలను (విజయ్ రావిళ్ల గారు, సుచేత గారు, గౌరీధర్ మాడు గారు, భారతి అన్నే గారు, శిరీష గండూరి గారు) మరియు సాంస్కృతిక సమన్వయకర్తలు (స్వప్న గారు, స్వర్ణ ప్రతిమ గారు, సారిక గారు, ఝాన్సీ గారు, తనూజ గారు, శైలజ గారు) శాలువాలతో సత్కరించారు. ముఖ్యంగా గురువుల సేవలను కొనియాడుతూ శాలువాలతో సత్కరించారు.

మనబడి గురువులు: వాణి గారు, మౌనిక గారు, హేమ గారు, లావణ్య గారు, సంధ్య గారు, అనంత లక్ష్మి గారు, అప్పారావు గారు, రఘు గారు, మెహర్ వేమరాజు గారు, కిరణ్మయి గారు, కృష్ణ గారు, సుధా రాణి గారు, సువర్ణ రేఖ గారు, సుకృత్ మహాజన్ గారు, గౌరీ బానవతుల గారు, చంద్ర గారు, గౌరి ఏడుపుగంటి గారు, సారిక గారు, రమేష్ గారు, శ్రీ వల్లి గారు, వసుంధర శిరసాల గారు, శ్రీభవ గారు, అరుణ్ గారు, శ్రీనివాస్ గారు.

మనబడి మారియెట్టా (Marietta) కేంద్ర సమన్వయకర్త భారతి అన్నే (Bharathi Anne) గారు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో సహాయపడిన వాలంటీర్లను (సురేష్ వాయుగుండల గారు మరియు అతని మొత్తం బృందం, వంశి కనమర్లపూడి గారు, ప్రఫుల్ల రామినేని గారు, ఫుడ్ కమిటీ సభ్యులు) ఫోటోగ్రాఫర్స్ సతీష్ బృందము, వీడియో గ్రాఫర్ నిరంజన్ జూలపెల్లి గారు, ఆడియోగ్రాఫర్ నారాయణ స్వామి గారు తదితరులను అభినందించారు.

అలాగే ఫ్లయర్స్ చేసిన మెహర్ వేమరాజు గారు, ఫోటో బూత్ ఏర్పాటు చేసిన సుప్రియ ఎడ్లపాటి, యశ్వంత్ గుర్రం, భాస్కర్ సిద్ధ మరియు ప్రదర్శనలలో సహాయపడిన గురువులకి, తల్లితండ్రులందరికీ (స్వప్న గారు, స్వర్ణ ప్రతిమ గారు, వంశీ గారు, సురేష్ గారు, అపర్ణ గారు, శ్రావణి గారు, ముకేశ్ గారు, స్మిత గారు, రాధిక గారు, లావణ్య గారు, మౌనిక గారు, సత్య గారు, మిగతా అందరూ) భారతి అన్నే గారు ధన్యవాదాలు తెలిపారు.

మనబడి ప్రాంతీయ సహ సమన్వయకర్త సుచేత (Sucheta Kanchanapalli) గారు ప్రతి వారం మనబడి కేంద్రాలలో సహాయపడే బాలగురువులందరిని, పిల్లల పండుగ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్న మనబడి బాలగురువులను (సహస్ర మాడు, రిషిక మజ్జిగ, అన్విత జిట్ట, అక్షర మహాజన్, అమేయ బీరకాయల మరియు ఆద్య పొనిగంటి) ప్రశంసించారు.

అందరూ ఎంతగానో ప్రశంసించిన విందు భోజనాన్ని తయారు చేసి, సమయానికి అందించిన వారు చంద్ర స్వయంపాకుల గారు, గణేష్ టెంపుల్. గో గ్రీన్ నుంచి మాలిని, రాజేష్ గార్ల బృందం పర్యావరణాన్ని సంరక్షించే నీటిని అందించారు. కన్నుల పండుగలా ఉన్న ప్రదర్శనలు, విందు భోజనంతో పిల్లలపండుగ నిజమైన పండుగ వాతావరణాన్ని తలపించింది. జయహో మనబడి. జయ జయహో సిలికానాంధ్ర మనబడి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected