Connect with us

Health

ఆటా 18వ మహాసభల టీం ఆధ్వర్యంలో Heartfulness Meditation @ Atlanta, Georgia

Published

on

అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) 18వ కాన్ఫరెన్స్ టీం మానసిక వికాసానికి దోహదపడే విధంగా ‘Heartfulness Meditationబృందం సహకారంతో జ్ఞానోదయ పరివర్తనను కేంద్రీకరిస్తూ ‘Heartfulness Meditation‘ అనే అద్భుత ధ్యాన సభను 21 జనవరి 2024 న అట్లాంటా (Atlanta) లో నిర్వహించారు.

Heartfulness Meditation ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక శ్రేయస్సుకు ఉపకరించే లోతైన ప్రయోజనాలను అన్వేషిస్తూ పలు రంగాల నిపుణులు, ఔత్సాహికులు మరియు ప్రావిజ్ఞులు పాల్గొనగా, స్నేహపూరిత ఆహ్వానం – అల్పాహారాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతూ ప్రశాంత వాతారణానికి తమ ఆతిథ్యంతో పరిపూర్ణతను ప్రతిబింబించారు Heartfulness బృందం.

సమన్వయకర్తలు సభాసదులను ఉద్దేశిస్తూ వివిధ కీలకమైన అంశాలను, సూచనలను, అనుభవసారాన్ని పంచుకోగా విచ్చేసిన వారందరికీ మానసిక, భావోద్వేగ, శారీరిక స్వస్థతకు మరియు వికాసానికి తోడ్పడే Heartfulness ధ్యానము యొక్క యోగమును గూర్చి వివరిస్తూ Meditation Session ను నిర్వహించారు.

Meditation Session లో పాల్గొన్న 18 వ ATA కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం (Kiran Pasham) తమ అనుభవాన్ని పంచుకుంటూ ఇంతటి అద్వితీయ అనుభూతిని పరిచయం చేసిన Heartfulness Meditation బృందానికి తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మనోభారాన్ని తగ్గిస్తూ మనోవికాసానికి తోడ్పడే Heartfulness Meditation ముమ్మాటికీ మానవాళికి అందిన శ్రేయస్కర మార్గం అని తాను విశ్వసిస్తున్నానని మరియు అందరి దినచర్యలో ధ్యానం ప్రధానాంశంగా పరిగణించడం ఆవశ్యకం అని కిరణ్ పాశం (Kiran Pasham) అన్నారు.

2024 జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటా (Atlanta) లో జరుగబోవు 18 వ ATA కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ (ATA 18th Conference & Youth Convention) ను గూర్చి ప్రసంగిస్తూ Heartfulness Meditation బృందానికి ATA తరుపున తమ ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు.

కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ అనిల్ బొడ్డిరెడ్డి, కాన్ఫరెన్స్ కో-డైరెక్టర్ శ్రీరామ్ మరియు కాన్ఫరెన్స్ కమిటీ చైర్స్ అనుపమ సుబ్బగారి, శ్రావణి రాచకుళ్ల, ఉదయ ఈటూరు, నీతు S, నిరంజన్ పొద్దుటూరి, సందీప్ రెడ్డి, జనార్ధన్ పన్నెల heartfulness meditation సభలో పాల్గొని తమ తమ అనుభూతులను ఉత్సాహంగా పంచుకున్నారు.

అలాగే కాన్ఫరెన్స్ కో- చైర్లు మాధవి దాస్యం, మహేష్ కొప్పు, రాజేష్ చప్పరపు, శ్రీనివాస్ కుక్కడపు, అనిల్ కుష్ణపల్లి మరియు మెంబెర్స్ రవీందర్ దాసరపు, కనక లక్ష్మి దాసరపు, శైలజ కుష్నపల్లి తదితరులు కూడా పాల్గొని నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected