Connect with us

Cultural

Washington DC: 5000+ ఆహ్వానితులతో GTA సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు విజయవంతం

Published

on

ప్రభంజనం.. జన సముద్రం.. నేల ఈనిందా.. ఆకాశం వర్షించిందా.. అన్నట్లుగా.. వాషింగ్టన్ డీసీ గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association) సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలు జరిగాయి.

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలు నభూథో నభవిష్యత్తు అనేలా ఇంతకు ముందు వాషింగ్టన్ డీసీ (Washington DC) బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా నిర్వహించారు.

అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు మరియు పిల్లలు సుమారు 5000 అతిథులు వరకు పాల్గోని సద్దుల బతుకమ్మ మరియు దసరా వేడుకలను ఘనంగా విజయవంతం చేసారు. GTA సంస్థ చైర్మన్, గ్లోబల్ ఉపాధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రెటరి, జాయింట్ సెక్రెటరి, ఎక్స్కూటివ్ కమిటి, కమిటి చైర్స్ & కో-చైర్స్ కలిసి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

GTA సంస్థ వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల సారధ్యంలో పెద్ద బతుకమ్మ లతో సుమారు 200 పైగా బతుకమ్మ లను తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కనుక మహిళలు, రాజకీయ నాయకులు, సంస్థ నిర్వాహాకులు అధిక సంఖ్యలో పాల్గోని డోలు డప్పులతో మరియు పోతురాజు విన్యాసాలతో ఊరేగింపు గా తీసుకరావటం జరిగింది.

బెస్ట్ బతుకమ్మ లకు బంగారు బహుమతులు మరియు పట్టు చీరలు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కోళాటం జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ Global Telangana Association వారు నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్ కంట్రీ ఓవెన్ అధినేత శ్రవణ్ పాడూరు భోజన కార్యక్రమాన్ని లీడ్ చేశారు.

శ్రవణ్ సారధ్యంలో వర్జీనియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్స్ పారడైజ్ ఇండియన్ కుసిన్, ఉడ్ల్యాండ్స్, కాకతీయ కిచెన్, తవ ఫ్రై, పేస్ట్రి కార్నర్ మరియు హైదరాబాద్ బిర్యాని పాట్, మేము కూడా తమ వంతు సహాయంగ పాల్గోని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:00 సుమారు 5000 అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.

మహిళా టీం: జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, జనత కంచర్ల, స్వర్ణ వీర్ల, జలజ ముద్దసాని, లక్ష్మి బుయ్యాని, నీరజ సామిడి, సంకీర్త ముక్క, శ్రుతి సూదిని, రష్మి కట్పల్లి, షర్మిల మేకల, సింధూర పల్రెడ్డి, సత్య బానొత్, సంధ్య కే, అనిత బండి, సుస్మిత జువ్వాడి, దీపిక వనమాల, మీన కలికోట, అనుపమ దోమ, స్వప్న కరివేడ, ప్రీతి రాచర్ల, అనూష గుండ, ఝాన్సి జోగు, రేవతి ముంద్రాతి, దివ్య అవ్వారు, శ్వేత వంగల, సమత తెల్లపెల్లి మరియు ప్రసన్న కోమటిరెడ్డి.

గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA) సంస్థ టీం: చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, సంపత్ దేశినేని మరియు సత్యజిత్ మారెడ్డి, స్టాండింగ్ కమిటి చైర్‌ శ్రీకాంత్ పొట్టిగారి మరియు ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు ప్రవీణ్ పల్రెడ్డి, కోట్య బానోత్, క్రిష్ణకాంత్ కుచలకంటి, కిరణ్ ఉట్కూరి మరియు రాము ముండ్రాతి, సెక్రెటరి శ్రీధర్ బండి, రఘు జువ్వాడి.

GTA ఎగ్జిక్యూటివ్ కమిటి: సంతోష్ సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బోబ్బా, వినోద్ పల్లె, శశి యాదవ్, కిరణ్ తెల్లపల్లి, అజయ్ కుండీకుఫుల్ల, అమర్ అతికం, వెంకట్ దండ, దేవేందర్ మండల, రఘు పాల్రెడ్డి, సతీష్ చింతకుంట, తరుణ్ పొట్టిగారి, డా.సుమన్ మంచిరెడ్డి, శ్రీని జూపల్లి, మీడియా చైర్ ఈశ్వర్ బాండ, మధు యనగంటి, రుక్మేష్ కుమార్ పూల, వరుణ్ కుసుమ, ప్రవీణ్ ఆలెటి, కమలాకర్ నల్లాల, వెంకట్ చిలంపల్లి, క్రిష్ణ రమావత్, కిరణ్ బైరెడ్డి, ప్రసాద్ కంచర్ల, వేణు కే, శ్రీధర్ పాడురి, భాస్కర్ చల్ల, రఘువీర్, కిరణ్ వి, శ్రవంత్ గుండా, రాఘవేందర్ బుయ్యాని, రఘు జూలకంటి, సంతోష్ కుమార్, అనిల్ నక్క, వెంకట్ మందడి, చారుహాసిని గోకరాజు, నవీన్ హరి, జయచంద్ర చెరుకూరి, గణేష్ ముక్క, సునీల్ కుడికాల మరియు వికాస్ ఉల్లి.

గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA) సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల (Vishweshwar Kalavala), ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గోన్నారన్నారు.

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలను బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో పాల్గోని గొప్ప ఘనవిజయం లో తోడ్పడిన మహిళలు, రెస్టారెంట్స్, బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్, స్పాన్సర్స్, వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది కి ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected