Connect with us

Events

అలరించిన TTA దసరా & బతుకమ్మ సంబరాలు @ King of Prussia, Greater Philadelphia

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గ్రేటర్ ఫిలడెల్ఫియ చాప్టర్ (TTA Greater Philadelphia Chapter) ఆధ్వర్యంలో దసరా మరియు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కింగ్ ఆఫ్ ప్రసియా (King of Prussia) లోని అప్పర్ మీరియన్ మిడిల్ స్కూల్ నందు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన దసరా ఉత్సవాలు ఆహుతులను అలరించాయి.

ఇందులో భాగంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఏర్పాటు చేసిన తెలంగాణ (Telangana) సంస్కృతి సంప్రదాయాలు బోనాలు మరియు బతుకమ్మ ఊరేగింపు షుమారు రెండు గంటలపాటు అత్యంత కోలాహలంగా సాగింది. పోతరాజు మరియు దసరా పులివేషాలతో సందడిగా సాగింది. పోతరాజుగా కార్తిక్ హావభావాలకు జనం మంత్రముగ్ధులయ్యారు.

పోతరాజు అమ్మవారికి కాపలా కాస్తూ ముందుకు సాగగా, గ్రేటర్ ఫిలడెల్ఫియా మహిళాలోకం అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలతో పాటు కొంతమంది మహిళలు బతుకమ్మలను పేర్చి తెచ్చి అమ్మవారిని నిలుపుకుని బతుకమ్మను కొలిచారు. ఆధ్యంతం డప్పులతో కోలాహలంగా భక్తి శ్రద్ధలతో సాగిన దసరా (Dussehra) ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గ్రేటర్ ఫిలడెల్ఫియా మహిళల ఫ్యాషన్ షోకి ఆడిటోరియం అంత సెల్ ఫోన్ లతో లైట్లు పెట్టి మహిళామణులకు ఉతేజాన్ని నింపారు. చిన్న పిల్లల డాన్సు పాటలతో, టిటిఎ స్టార్స్ చిత్రలహరి, రే ల రే (Rela Re Rela) శాలిని జానపదాలతో గ్రేటర్ ఫిలడెల్ఫియా అంతా మారుమోగిపోయింది. రాత్రి పదిగంటలకు సైతం వందల మంది మహిళలు బతుకమ్మ ఆడి అమ్మవారిని కొలిచారు.

చివర్లో పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్దపులి గండి మైసమ్మ, తీన్మార్ స్టెప్పులు వేసి సంతోషంగా గడిపారు. గ్రేటర్ ఫిలడెల్ఫియా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇంత చక్కగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ పండుగ జరిపినందుకు కల్చరల్ టీమ్ కు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసారు.

అదేవిధంగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పెన్సిల్వేనియా స్టేట్ సెనేటర్ Katie Muth హాజరు అయ్యి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపినారు. ఇక ఈ వేడుకలను ఆద్యంతం ఉత్సాహంగా వ్యాఖ్యాతలు కార్తీక్ మరియు శ్వేతా నడిపించారు. ఇక తెలంగాణ అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. ఆహూతులందరికి తెలంగాణ వంటల రుచి చూపించారు నిర్వాహకులు.

దసరా సంబరాలకు ప్రత్యేకమైన తెలంగాణ (Telangana) భగారా కోడికూర వండి పెట్టారు. షుమారు రెండు వేల మందికి ఇంటి భోజనం చేయటమంటే అమెరికాలాంటి దేశంలో అంత చిన్న విషయం కాదు అలాంటిది పలు రకాల వంటకాలతో ఆహూతులకు రుచితో విందు భోజనం వడ్డించారు. ఇందుకు శ్రమించిన ఫుడ్ టీమ్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు.

ఆధ్యంతం భక్తిశ్రద్ధలతో తెలంగాణ సంస్కృతికి అద్ధంపట్టే దసరా వేడుకలను టిటిఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనారపు, నేషనల్ ఇంటర్నల్ అఫైర్స్ కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి, బోర్డు అఫ్ డైరెక్టర్స్ రమణా రెడ్డి కొత్త , భాస్కర్ పిన్న ,కిరణ్ రెడ్డి గూడూరు,రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ వంశీ గుళ్ళపల్లి, వేణు ఏనుగుల మరియు ప్రదీప్ కాయిదాపురం, రవీందర్ గట్ల, శివ జాజపురం, అరుణ్ మేకల, గౌతమ్ వేపూర్, మహేష్ శంభు, కార్తిక్, సతీష్ ,ప్రణీత్, త్రినాధ్, శ్రీనివాస్ వి, శరత్, అనుదీప్ మరియు తదితరులు ఈ కార్యక్రమానికి కావాల్సిన ఆర్ధిక వనరులు సమకూర్చి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇంత గొప్ప సంస్థని ఏర్పాటు చేసిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ పైళ్ళ మల్లారెడి గారికి , అడ్వైసరీ చైర్ విజయపాల్ రెడ్డి గారికి , అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల గారికి , అడ్వైసరీ మెంబెర్ భరత్ మాదాడి గారికి, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారికి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారికీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ టీమ్ కి గ్రేటర్ ఫిలడెల్ఫియా టీ.టీ.ఏ టీమ్ కృతజ్ఞతలు తెలిపినారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected