Connect with us

Events

తెలుగుదనం ఉట్టిపడేలా Orlando లో ఆటా బతుకమ్మ వేడుకలు

Published

on

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆధ్వర్యంలో ఫ్లోరిడా (Florida) రాష్ట్రం లోని ఓర్లాండో (Orlando) లో అక్టోబర్ 15, 2023 న నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా దుర్గా మహా దేవి సాన్నిథ్యంలో జరుపబడ్డాయి.

తెలుగుదనం ఉట్టిపడేలా దాదాపు 200 మంది ఆడపడుచులందరు తమ గౌరమ్మ తల్లిని పులకింప చేసారు. ఈ Bathukamma పండుగను శ్రీమతి బొమ్మా రాధికా గారి ఆతిధ్య సహా కారంతో, శ్రీ వొంగురు విజయ్, రీజినల్ కోఆర్డినేటర్, ప్రశాంతి రెడ్డి, నేషనల్ విమెన్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

ఓర్లాండో (Orlando) ఆటా బృందం శ్రీమతి మాధురిమ పాతూరి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA), లీగల్ కమిటి చైర్, డాక్టర్ బుచ్చి రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ లోకల్ ఎగ్జిక్యూటివ్, మహేందర్ ఆనేపల్లి, మెంబెర్స్ కమిటి, డాక్టర్ నీలిమ కటుకూరి ఈవేడుకలు విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాన్ని అందచేశారు.

ఫ్లోరిడా (Florida) రాష్ట్రం లోని ఓర్లాండో లో అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) బతుకమ్మ వేడుకలు తెలుగు ఉత్సవ వేడుకగా, ఉత్సాహిన్ని నింపి మాతృభూమి ని తలపింపచేశాయి.

error: NRI2NRI.COM copyright content is protected