Connect with us

News

చంద్రబాబుకి మద్దతుగా NRI TDP Kuwait & Janasena ఆధ్వర్యంలో జలదీక్ష

Published

on

NRI TDP Kuwait మరియు Janasena ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మాలియా ప్రాంతం లో బాబు గారి అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ నిరసన లో భాగంగా జలదీక్ష చేపట్టారు. 73 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తిని ఏ తప్పు చేయని 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని తమ రాజకీయ మనుగడ కోసం అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సిగ్గుచేటు అని అన్నారు.

అక్రమ అరెస్ట్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్క ఆధారము కోర్టు ముందు ఉంచలేక పోతున్న ఈ ప్రభుత్వం బాబు గారిని మానసిక క్షోభకు గురి చేసే ప్రయత్నం తప్ప వేరొకటి కాదు. బాబు గారికి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు, డీహైడ్రేషన్ సమస్య వల్ల చర్మం పై దద్దుర్లు వచ్చాయి అని సదరు జైల్ అధికారి రాజమహేంద్ర వరం ప్రభుత్వ ఆసుపత్రి కి తెలిపితే వారు వచ్చి వైద్యం చేసి మందులు ఇచ్చారు అని ప్రకటన విడుదల చేశారు.

అసలు ప్రకటన చేయాల్సిన ప్రభుత్వ డాక్టర్ కు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఆయన బరువు తగ్గారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో జైల్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో ఈ మాట చెప్పనే లేదు. కోర్టు లో ఉద్దేశ్య పూర్వకంగానే వాయిదా లు అడుగుతూ అక్రమ నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. బాబు (Nara Chandrababu Naidu) గారి లాయర్ ల పైన దౌర్జన్యాలకు దిగుతున్నారు.

అక్రమ అరెస్ట్ చేసిన రోజు ఆ అరెస్ట్ లో పాల్గొన్న అధికారుల కాల్ లిస్ట్ లు అడిగారు బాబు గారి తరుపు లాయర్లు. మీలో ఏ తప్పు లేకపోతే మీరు చేసిన నిర్బంధం సహేతుకం అయితే కాల్ లిస్ట్ ప్రజల ముందర పెట్టండి. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ఈ తంతును ప్రజలు గమనిస్తున్నారు.ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన వైసీపీ నీ బంగాళాఖాతం లో ప్రజలు కలపడం ఖాయం.

ఈ కార్యక్రమంలో GCC Gulf Member Venkat Koduri, NRI TDP Kuwait ప్రధాన కార్యదర్శి మల్లి మరోతు, సినియర్ నాయకులు ములకల సుబ్బరాయుడు, BP పెంచలయ్య, పత్తి సుబ్బరాయుడు, డాక్టర్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు కుదరవల్లి కృష్ణ చైతన్య, జనసేన నాయకులు, హరి రాయల్, జిలకర మురళి, గాంగరాపు చంద్రశేఖర్, అలీ NRI TDP Coordinators కోలపనేని రమేష్, ముస్తాక్ ఖాన్, నరసింహులు, హేమంత్ రాయల్, మల్లిసెటి రవి, శ్రీను, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected