Connect with us

Health

తామా ఫ్రీ క్లినిక్ 5కె వాక్ కి ఆరోగ్యోత్సాహంతో కూడిన విశేష స్పందన

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) తామా వారు స్థానిక న్యూటౌన్ పార్క్ లో ‘తామా ఫ్రీ క్లినిక్ 5 కె వాక్’ నిర్వహించారు. పది సంవత్సరాలకు పైగా నడుస్తున్న తామా వీక్లీ ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) ద్వారా దాదాపు 10 వేలమందికి సేవలందించారు.

తక్కువ లేక అస్సలు భీమా లేనివారు, విజిటింగ్ పేరెంట్స్, స్టూడెంట్సే కాకుండా మరెందరో లబ్ధి పొందిన వారిలో ఉన్నారు. 25 మంది దాకా డాక్టర్లు, 50కి పైగా సర్టిఫైడ్ వాలంటీర్లు, యూత్ వాలంటీర్ల అవిరామ కృషితో నడుస్తోన్న ఇలాంటి వీక్లీ ఫ్రీ క్లినిక్ మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

తామా ఉచిత క్లినిక్ (TAMA Free Clinic) అవగాహన మరియు విరాళాల సేకరణ కోసం నిర్వహించిన వార్షిక 5కె వాక్ లో ఊహించినదాని కంటే ఎక్కువగా సుమారు 400 మంది పాల్గొన్నారు. పెద్దలు, చిన్నారులు, యువత, సీనియర్లు ఉల్లాసోత్సాహాలతో పాల్గొని క్రొత్త ఒరవడి సృష్టించారు.

అందులోనూ ఈ మహత్కార్యానికి సహృదయంతో ముందుకు వచ్చిన ఎందరో దాతలకు శతకోటి ప్రణామాలు. వారిలో చాలామంది వాక్ కు విచ్చేయడం ముదావహం. ఎంతో మంది డాక్టర్లు రావడం, వాక్ చేయడం అందరికీ చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది.

అలానే ఇతర సంస్థలకు చెందిన నాయకులు, సభ్యులు రావడం, వాక్ లో పాల్గొనడం ఆనందదాయకం. తామా వారు అన్ని వయసుల వారికి ఉపయోగపడే ఎన్నో విభిన్న, ఉపయుక్త కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం మరియు యువత ప్రాధాన్యంగా సాగుతున్న ఈ సంవత్సరంలో క్లినిక్ 5కే వాక్ తామా వారి 17వ కార్యక్రమము.

మరిన్ని వివరములకు www.tama.org సందర్శించండి లేక [email protected] కి ఇమెయిల్ పంపండి. వాలంటీర్లు, తామా టీం ఉదయం 6:30 గంటల కల్లా వచ్చి, ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందరికీ నమోదు డెస్క్ వద్ద టీ షర్టులు, బిబ్స్, పిన్స్ ఇవ్వడం జరిగింది.

వార్మ్ అప్ లో భాగంగా జరిగిన జుంబా డ్యాన్స్ తో మొదలయ్యింది అసలు సందడి. పార్క్ (Newtown Park) అంతా సైన్ బోర్డ్స్, బ్యానర్స్, రిజిస్ట్రేషన్ బూత్, బ్రేక్ ఫాస్ట్ స్టాల్, డీజే స్టేషన్, యూత్ వాలంటీర్లు, వాక్ లో పాల్గొన్న పురజనుల పలకరింపులతో కళకళలాడిపోయింది.

వాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టార్ట్ – ఫినిష్ ఆరంజ్ ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తదుపరి ఛైర్మన్ సుబ్బారావు మద్దాలి ముందుగా డాక్టర్స్ అందరినీ వేదిక మీదకు ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ, ఈ క్లినిక్ కి వచ్చి సేవ చేయడం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెప్పి, చాలా కాలంగా ఇంత స్థిరంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తున్న తామాకి శుభాభినందనలు తెలిపారు.

తామా బోర్డ్ ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి క్లినిక్ దాతలను, 5కె వాక్ లో పాల్గొన్నవారిని కొనియాడారు. క్లినిక్ కోఆర్డినేటర్ నగేష్ దొడ్డాక క్లినిక్ పుట్టు పూర్వోత్తరాలు విశదీకరించారు. అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి ఈ సంవత్సరం చేయూత నిచ్చిన దాతలను వేదిక మీదకు పిలిచి, వారు చేసిన సహాయానికి ఉన్న విలువ అపారమైనదని కృతజ్ఞతలు తెలిపారు.

విశిష్ట అతిథులుగా విచ్చేసిన జాన్స్ క్రీక్ సిటీ (Johns Creek City Council) కౌన్సెల్ సభ్యులు స్టేసీ స్కిన్నర్, బాబ్ ఎర్రమిల్లి వారి నగరమైన జాన్స్ క్రీక్ లో ఈ తరహా కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసి, తామా క్లినిక్ ద్వారా అందజేయు సేవలను మెచ్చుకున్నారు. స్పాన్సర్లను, డాక్టర్లను, అతిథులను తామా వారు సముచితంగా సత్కరించారు.

సుమారు 8:45 గంటలకు ప్రారంభమయిన TAMA Free Clinic వాక్ లో టైటిల్ స్పాన్సర్ ఎస్ వి కె సిస్టమ్స్ వారి టీం, ప్రెసెంటింగ్ స్పాన్సర్ డాక్టర్ గురు ప్రసాద్, సిగ్నేచర్ స్పాన్సర్స్ ధనుంజయ్ జల్లా, అరుణ మద్దాళి, డాక్టర్లు, స్పాన్సర్లు ఎంతో ఉత్తేజభరితంగా పాల్గొన్నారు.

వాకర్స్ అందరూ నిర్దేశించిన మార్గంలో వడివడిగా నడుస్తూ, కలివిడిగా మాట్లాడుకుంటూ, వాలంటీర్లు అందించే నీళ్లు తాగుతూ, ఫోటోలు తీసుకుంటూ హుషారుగా ముందుకు సాగారు. వేసవి శలవల తరువాత ఇప్పుడిప్పుడే బడులకు వెళ్తున్న చిన్నారులకు, తీరిక లేకుండా ఉన్న తల్లిదండ్రులకు సేదదీరేందుకు కూడా ఈ వాక్ ఉపయోగపడింది.

తామా పూర్వపు ప్రెసిడెంట్లు, ఛైర్మన్లు, సభ్యులు మరియు మద్దతుదారులు పిల్లల, పెద్దల, సీనియర్ల, మహిళల విభాగాలలో విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున హాజరైన యువత, పిల్లలలో గెలిచినవారికి గిఫ్ట్ కార్డులు కూడా అందజేశారు.

రుచి, శుచి కలబోతగా ఇడ్లీలు, పొంగల్, వడ, టీ, కాఫీ, గేటరేడ్, నీరు, అరటి పండ్లు విచ్చేసిన అందరికీ అందజేశారు. రాజేష్ జంపాల, వినయ్ మద్దినేని ముందు రోజు వచ్చి ఏర్పాట్లలో తామా (Telugu Association of Metro Atlanta) టీం కు తోడ్పాటు అందించారు.

విశేష ఆదరణ, విశిష్ట అవగాహన లక్ష్యాలను అందుకుని, దిగ్విజయంగా సాగిన ఈ వాక్ కి తమ సహాయ సహకారాలందించిన దాతలకు, డాక్టర్లకు, వాలంటీర్లకు, తామా జట్టుకు, మద్దత్తు ఇచ్చిన అట్లాంటవాసులకు కృతజ్ఞతలు తెలియజేసి తామా బోర్డ్ ఛైర్మన్ సుబ్బారావు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు. మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Free Clinic 2023 5K Walk ని సందర్శించండి.

తామా ఉచిత క్లినిక్ 5కె వాక్ స్పాన్సర్‌ల వివరాలు:-

Title Sponsor Sri. Hanuman Nandanampati (SVK Systems)
Presenting Sponsor Dr. Guru Prasad Ghanta
Signature Sponsors Sri. Dhanunjay Jalla (Elpha Execu Suites), Smt. Aruna Maddali (Maddali CPA)
Elite Sponsors
Dr. Praveen Gudipati (Cumming Dental Smiles)Sri. Srinivas Lavu (Delta Information Systems)
Sri. Kiran Pasham (SplashBI)Sri. C K Rao (Cavv Tech Inc)
Sri. Mohan Edara (Horizon Softech)Smt. Malathi Nagabhirava (Zahdoo LLC)
Sri. Venkat Chennubhotla (Beats & Events)Sri. Srinivas Uppu (Ansai Tech)
Sri. Madhukar Yarlagadda (Comsys Group)Sri. Raghava Tadavarthi (Vydya Health)
Sri. Ramki ChowdarapuSri. Shyam Padamatinti
Sri. Sai NatakalaSri. Ramu Kesani
Sri. Sairam KarumanchiSri. Vijay Kothapalli
Sri. Sasi DaggulaSri. Venkata Siva Gokyada
Patron Sponsors
Dr. Nandini SunkireddySri. Bharath Maddineni (Maxeom Inc)
Sri. Mallik Medarametla (Sampra Soft)Sri. Viju Chiluveru garu (VCIT Solutions)
Sri. Bharath Govindaluri (Assure Guru)Sri. Kris Gadde (Allied Informatics)
Sri. Ravi Chander (Softpath System)Sri. Purna Veerapaneni
Sri. Raju MandapatiSri. Ravi Kalli
Sri. Ram GaripalliSri. Innaiah Yenumula
Sri. Mahesh PawarSri. Suneetha Potnuru
Sri. Rupendra VemulapalliSri. Anand Akkineni
Smt. Priyanka GaddamSri. Praveen Boppana
Friends of TAMA
Sri. Venkat Adusumilli (Vela Life Plan)Sri. Kishore Mellacheruvu (SSVK Tech)
Sri. Prashant Veerabomma (VBP Group)Sri. Srikanth Madineni (Omega Advisory)
Sri. Srinivas CherukumilliSri. Srikanth Veeravalli
Sri. Venkat TeralaSri. Sudhakar Boddu
Sri. Murali BodduSri. Anil Yalamanchili
Sri. Bala IndurtiSri. Rajesh Jampala
Sri. Venkat MeesalaSri. Venky Gadde
Sri. Manoj TatikondaSri. Nagesh Doddaka
Sri. Rajashekar ChunduriSri. Kamal Satulur
Sri. Sreeram RoyyalaSri. Mahesh Koppu
Sri. Ram MaddiSri. Satish Raavi
Sri. Venkat MaddiSri. Aravind Miryala
Sri. Vinay MaddineniSri. Suresh Dhulipudi
Sri. Ramesh Babu ChaparalaSri. Pavan Devalapalli
Sri. Suresh BandaruSri. Srinivasulu Ramisetty
Sri. Krishna  inapakuthikaSri. Tiru Chillapalli
Sri. Suneel DevarapalliSri. Anand Kamisetty
Sri. Prasad MatteySri. Srinivas Thammisetti

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected