Connect with us

News

పుర ప్రముఖులకు 28 అవార్డులు @ TANA Conference, పూర్తి వివరాలు: NRI2NRI.COM

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు తానా అవార్డులను (Awards) బహుకరించనున్నది.

తానా ఎన్టీఆర్‌ (NTR) కల్చరల్‌ అవార్డును తెలుగు సినీనటుడు, నంది పురస్కార గ్రహీత, నిర్మాత, పారిశ్రామికవేత్త, మాజీ లోక్ సభ సభ్యులు మాగంటి మురళీ మోహన్‌ (Maganti Murali Mohan) గారికి అందిస్తున్నారు. మురళీ మోహన్‌ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకుని కళారంగానికి చేసిన కృషికి గుర్తింపుగా తానా ఆయనకు ఈ అవార్డును బహుకరిస్తోంది.

తానా జీవిత సాఫల్య పురస్కారమును కోవిడ్ (COVID-19) మహమ్మారి నుండి మానవాళిని కాపాడిన కోవాగ్జిన్ (Covaxin) టీకా సృష్టికర్త, భారత దేశ మొట్టమొదటి తిమెరోసాల్ -ఫ్రీ హెపటైటిస్ బి వాక్సిన్ (Hepatitis Vaccine) ఉత్పత్తిదారు అయినటువంటి భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డా. కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల (Dr. Krishna Ella and Suchitra Ella) దంపతులకు ఇస్తున్నట్లు తానా ప్రకటించింది.

తానా ఫౌండేషన్‌ (TANA Foundation) అవార్డును అమెరికాలో స్థానిక తెలుగువారికి దాతృత్వ సేవ అందిస్తునందుకుగాను శ్రీ రంగనాథ బాబు గొర్రెపాటి గారికి అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఘంటసాలకు చెందిన రంగనాథ బాబు (Ranganath Babu Gorrepati) అమెరికాకు వలస వచ్చిన తొలి తరం ప్రవాస తెలుగు వారిలో ఒకరు.

అలాగే తెలుగు భాషకు విశేష సేవలందించిన వారికి ఇచ్చే గిడుగు రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) అవార్డును ఈసారి మనసు ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు‌ డా. మన్నం వెంకట రాయుడు (Dr Mannam Venkata Rayudu) గారికి తానా బహుకరిస్తోంది. తానా నాయకత్వం ఏకగ్రీవంగా ఈ పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసింది.

ఎంపికైన ప్రముఖులకు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా 23వ మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా మహాసభల ఛైర్మన్ శ్రీనివాస్ లావు అభినందనలను తెలియజేశారు. 100 కి పైగా వచ్చిన నామినేషన్స్ లో అవార్డ్స్ కమిటీ ఫైనలైజ్ చేసిన మిగతా అవార్డు గ్రహీతల వివరాలు ఇవిగో!

TANA Excellence Awards

1. Dr. Sudhakar Jonnalagadda – Community Service and Medicine

2. Dr. Vemuri Murthy – Medicine

3. Judge Dipti Pidikiti-Smith – Law and Community Service

4. Mrs. Malini Puli – Community Service

5. Dr. Venkateswararao Kata – Service to TANA

6. Patibanda Sarma – Community Service

7. Prof. Satya Kunapuli – Science

8. Srinivas Vemulapalli – Community service

9. Dr. Shankar Musunuri  – Entrepreneurship

10. Dr. H. Rayudu Koka – Medicine and Community Service

TANA Meritorious Achievement Awards

1. Dr. Raju Vegesna – Entrepreneurship

2. Dr. Bellamkonda K. Kishore – Science

3. Vamsi Kora – Entrepreneurship

4. Sailaja Adluru – Women Empowerment

5. Mallika Madduri – Arts

6. Mr. Venkateswara Chinni – Community Service

7. Nageswara Rao Manne – Telugu Language Promotion

8. Madhavi Soleti – Arts and Education

9. Sasi Kanth Vallem – Agriculture Entrepreneurship

10. Babji Rao Yalamanchili – Community Service

Youth Excellence Awards

1. Soenika Gorrepati – Community Service and Leadership

2. Akarsh Kollu, NJ – Academics

Youth Meritorious Awards

1. Sindu Surapaneni – Arts and Community Service

2. Geetika Kodali – Sports

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected