అమెరికాలోని చార్లొట్ నగరంలో నివసిస్తున్న దాదాపు 200 మంది ప్రవాసాంధ్రులు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్లొట్ నగరంలో నివసిస్తున్న పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వీరంతా రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, అధికార వికేంద్రీకరణ వద్దంటూ నినదించారు. వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమరావతిలో వున్న రైతులతో మాట్లాడి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిరక్షణ సమితి సభ్యుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ కొలికపూడి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారై లకు అమరావతిలో జరుగుతున్న పరిస్థితులు వివరించారు.