Connect with us

Cultural

శుభారంభాన్ని అందించిన అట్లాంటా ధీం-తానా పోటీలు

Published

on

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తానా మహాసభలకు ముందు ధీం-తానా (DhimTANA) పోటీలు నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే 23వ తానా మహాసభలలో భాగంగా గత ఆదివారం ఏప్రిల్ 30న అట్లాంటాలో నిర్వహించిన ధీం-తానా పోటీలతో మంచి శుభారంభాన్ని అందించారు.

అట్లాంటాలోని ఆల్ఫారెటా (Alpharetta) పట్టణం, స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో నిర్వహించిన ధీం-తానా 2023 కిక్ ఆఫ్ పోటీలను తానా నాయకులు, ధీం-తానా టీం జ్యోతి ప్రజ్వలనతో ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. ముందుగా సోలో సింగింగ్, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించారు. సింగర్ రఘు కుంచె అతిథిగా విచ్చేసారు.

అనంతరం మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, చిలకా గోరింకా కపుల్ కాంటెస్ట్ నిర్వహించారు. అన్ని విభాగాలలో కలిపి 112 రెజిస్ట్రేషన్స్ రావడం చూస్తే ధీం-తానా (DhimTANA) 2023 పోటీలకు అట్లాంటా (Atlanta) వారు మంచి ఊపు తెచ్చారనడం అతిశయోక్తి కాదు.

ఈసారి కొత్తగా నిర్వహించిన చిలకా గోరింకా కపుల్ కాంటెస్ట్ కి అసాధారణ స్పందన రావడం విశేషం. పలు విభాగాల విజేతలకు మెమెంటోస్, క్రౌన్ అందించారు. స్థానిక అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఈ కార్యక్రమానికి కోహోస్ట్ గా వ్యవహరించింది. పిల్లలకు పిజాలు, పెద్దలకు లంచ్ ఏర్పాటు చేశారు.

ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri) కన్వీనర్ గా నిర్వహించనున్న తానా 23వ మహాసభలకు ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ అందరినీ సభాముఖంగా ఆహ్వానించారు. పలు జాతీయ, స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు విచ్చేసి తమ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా తానా కళాశాల గురువులను శాలువా మరియు పుష్పగుచ్చంతో సన్మానించారు. భారతీయ శాస్త్రీయ నృత్య విభాగాలకు డల్లాస్ నుంచి డా. సుధారాణి కలవగుంట మరియు డా. రాజేష్ అడుసుమిల్లి ప్రత్యేకంగా విచ్చేసి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అలాగే స్పాన్సర్స్ మరియు స్థానిక జడ్జెస్ ని వేదిక మీదికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

ధీం-తానా నిర్వహించే మొట్టమొదటి సిటీ కావడం, ఎక్కువ సమయం లేనప్పటికీ ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ, కోఛైర్స్ శ్రీలక్ష్మి కులకర్ణి మరియు సోహిని అయినాల, అలాగే కమిటీ సభ్యులు పూలని జాస్తి, పల్లవి దొప్పలపూడి, ఆర్తిక అన్నే, ప్రియాంక గడ్డం, నీలిమ గడ్డమణుగు మరియు తామా టీం ఈ పోటీలను విజవంతంగా నిర్వహించడం అభినందనీయం.

అప్రతిహాతంగా 10 గంటలపాటు సాగిన ఈ అట్లాంటా ధీం-తానా పోటీల హైలైట్స్ టీవీ9 లో ప్రసారం అవుతాయి. ఈ సందర్భంగా ధీం-తానా నిర్వాహకులు తానా నాయకులకు, వాలంటీర్లకు, తామా జట్టుకి, స్పాన్సర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

Click Here for DhimTANA Atlanta Winners List:-

DhimTANA National Sponsors:-
Grand Sponsor: Jubliance Sasha Homes
Silver Sponsors: Octave, Splash BI, Shoora EB5, Pooja Wadhwani

DhimTANA Atlanta Sponsors:-
Telugu foods
Samprasoft
Maxeom
Madhukar Yarlagadda
Legacy Academy
AssureGuru
Bombay Lounge
Aura event and decor for beautiful decor
AR Dazzle events for sound system and lights

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected