Connect with us

Associations

TDF Atlanta చాప్టర్ నూతన కార్యవర్గం ప్రకటన, 2023 ఈవెంట్స్ క్యాలెండర్ విడుదల

Published

on

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (Telangana Development Forum – TDF) ఇటు అమెరికా అటు ఇండియాలో తెలంగాణ సంబంధిత కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి, సంప్రదాయాల పరంగా నిర్వహించే కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ముందుంటూ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే సంఘటితమై ఇప్పటికీ అదే క్లారిటీ అదే ఎజెండాతో ముందుకు వెళుతున్న ముఖ్యమైన సంఘాలలో మొట్టమొదటి వరుసలో ఉంటుంది ఈ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (TDF). అమెరికాలోని పలు నగరాలలో సిటీ వైడ్ చాఫ్టర్స్ ఏర్పాటు చేసి తమ ఔన్నత్యాన్ని చాటుతున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అట్లాంటా చాప్టర్ (Atlanta Chapter) 2023 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కరణ్ కేశిరెడ్డి (Karan Kesireddy) అధ్యక్షునిగా ఏర్పాటైన టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్ నూతన కార్యవర్గానికి అట్లాంటా వాసులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇంకా ప్రముఖులు అపర్ణ పింగ్లే, అరవింద్ కట్టా, హరీష్ సూదిని, సంతోష్ రెడ్డిమల్లి, రమాకాంత్ అన్నాది, ప్రమోద్ కాసి, లలిత కొత్తూరు, ప్రియ శనిగరపు, చంద్ర సుబ్బగారి, రోహిత్ మండల, ఆనంద్ గుండు, శ్రీనివాస్ దుర్గం, గణేష్ తోట, డా. నందిని సుంకిరెడ్డి, పవన్ గరిన, రోహిత్ చెప్యాల వివిధ పదవులలో ఉన్నారు.

కిరణ్ బద్దం, రాజేందర్ జనుంపల్లి మరియు స్వప్న కస్వ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు. టీడీఎఫ్‌ అట్లాంటా చాప్టర్ కోర్ టీం ని కూడా ప్రకటించారు. అలాగే 2023 ఈవెంట్స్ క్యాలెండర్ (Events Calendar) ని కూడా విడుదల చేయడం చూస్తుంటే పక్కా ప్రణాళికతో 2023 కార్యక్రమాలు నిర్వహించనున్నట్టున్నారు.

టీడీఎఫ్‌ అట్లాంటా (TDF Atlanta) చాప్టర్ మాజీ అధ్యక్షులు బాపురెడ్డి కేతిరెడ్డి (Bapureddy Kethireddy) టీడీఫ్ యూఎస్ఏ జాతీయ ఉపాధ్యక్షులుగా మరియు స్వాతి సుదిని (Swathi Sudini) జాతీయ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికవడం విశేషం. దీంతో జాతీయ స్థాయిలో కూడా అట్లాంటా చాప్టర్ కి పట్టు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected