Connect with us

Convention

తానా సభలకు హాజరు కానున్న హైదరాబాద్ నిజాం 9వ నవాబు రౌనఖ్ ఖాన్

Published

on

ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభల ఆహ్వానపర్వం కొనసాగుతుంది.

రవి పొట్లూరి (Ravi Potluri) సారధ్యంలోని బృందం ఇప్పటికే ఇండియాలో పలువురు ప్రముఖులకు ఆహ్వానపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ నిజాం నవాబులలోని ప్రముఖ 9వ నవాబు రౌనఖ్ ఖాన్ ని కలిసి ఆహ్వానించారు. రౌనఖ్ ఖాన్ కూడా తప్పకుండా హాజరవుతానని, ఇది తమకు గౌరవంగా భావిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తోపాటు ఇండియా వ్యవహారాల డైరెక్టర్ వంశీ కోట (Vamsi Kota), కార్పొరేట్ స్పాన్సర్షిప్ ఛైర్ జగదీశ్ ప్రభల (Jagadish Prabhala), ప్రసాద్ గారపాటి, సుబ్రమణ్యం ఓసూరు, ముప్పా రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected