ATA ఆస్టిన్ టీం, కేవలం రెండు వారాల వ్యవధిలోనే, లేక్వుడ్ పార్క్, లియాండర్, టెక్సాస్ (Leander, Texas) లో మరో 5K వాక్‌థాన్ (Walkathon) ను ఆగష్టు 16న విజయవంతంగా నిర్వహించింది. నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఈ వాక్‌థాన్‌లో 200+ మంది పాల్గొనడం విశేషం.
ప్రతి ఒక్కరికీ ఉచిత బ్రేక్‌ఫాస్ట్, ఎనర్జీ డ్రింక్స్, వాటర్ అందించబడింది. ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నర్సి రెడ్డి గడ్డికొప్పుల (BOT & Executive Director) మరియు వెంకట్ మన్హెన గారు హాజరై, రాబోయే ATA ఈవెంట్స్, మెంబర్షిప్ ప్రయోజనాలను వివరించారు.
రీజినల్ డైరెక్టర్ సంగమేశ్వర్ రెడ్డి (Sangameshwara Reddy Reddygari) గారు సభ్యులుకాని వారిని ATAలో చేరమని ఆహ్వానిస్తూ, ATA లక్ష్యం తెలుగు భాష, సంస్కృతిని కాపాడటం మరియు ప్రోత్సహించడం అని తెలియజేశారు. పురుషులు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్స్ విభాగాలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ATA స్థానిక బృందం సంగమేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ చక్కా, షీతల్ గంపవార్, సైలజ కొమటి, ఆనంద్ యాపర్ల, రాజశేఖర్ బెరిటోలు యూత్ వాలంటీర్స్: ఈషా తిగిరెడ్డి, జశ్వంత్ జగదీశన్, యశ్వంత్ యాపర్ల, హర్షిణి మన్హెన, ఆర్కిత రెడ్డి లాంబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే ఈ వాక్‌థాన్ (Walkathon) ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, పాల్గొన్నవారికి, వాలంటీర్స్‌కి మరియు స్పాన్సర్స్‌కి ఆటా ఆస్టిన్ టీం (American Telugu Association – ATA – Austin Chapter) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.