Connect with us

Health

మాతృదినోత్సవం సందర్భంగా చికాగో ఆంధ్ర సంఘం 5k walk విజయవంతం

Published

on

Chicago Andhra Association (చికాగో ఆంధ్ర సంఘం) మే 12 వ తేదీన, మాతృదినోత్సవాన్ని (Mother’s Day) పురస్కరించి ఏటేటా ఆనవాయతీగా నిర్వహించే 5k walk ను Whalon Lake వద్ద నిర్వహించారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, మరియు చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా చికాగో వాసులు విచ్చేసారు.

సంస్థ అభ్యున్నతిని ఎంతో ప్రోత్సహిస్తున్న స్పాన్సర్లు, సంస్థ సభ్యులకు చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra AssociationCAA) వారు కృతజ్ఞతలు తెలిపారు. మన జీవితాల్లో తాము అందించే నిస్వార్థ ప్రేమ, అపరిమితమైన సహకారం, అనంత త్యాగాలకు తల్లులు అందరికీ చికాగో ఆంధ్ర సంఘం వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.

విచ్చేసిన మాతృమూర్తులందరికీ తమ పిల్లలు పూల గుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్-మల్లేశ్వరి పెదమల్లు, సుజాత-పద్మారావు అప్పలనేని, డా॥ సంధ్య అప్పలనేని, డా ॥ ఉమ కటికి, రాఘవ-శివబాల జాట్ల, పూర్వ అధ్యక్షులు శ్రీశైలేష్ మద్ది, మాలతి దామరాజు, గౌరీశంకర్ అద్దంకి కార్యక్రమనికి విచ్చేసి తమ సహకారాన్నందించారు.

ఉదయం 8 గం॥ లకు HPXpressions Dance + Fitness హేత గారు నిర్వహించిన Zumba Dance తో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆనందించారు. తదనంతరం 5K walk ను పలు విభాగాల్లో – 12 సం॥ లోపు చిన్నారులు, 21 సం॥ లోపు యవకులు, 21 సం॥ పై వారు మరియూ సీనియర్ సిటిజన్స్ గా నిర్వహించారు.

ఈ 5k walk ను సకాలంలో పూర్తి చేసిన ప్రతి విభాగములో మొదటి ముగ్గురిని విజేతలు గా ప్రకటించారు. విజేతలకు Silicone Idli Liners మరియు Kalash Costumes వారు బహుమతులు అందజేశారు. నరేష్ చింతమాని ఆధ్వర్యంలో, స్థానిక ఇండియన్ రెస్టారెంట్ Vishnu Vilas వారు విరాళము గా అందించిన ఎంతో రుచికరమైన వేడి వేడి మిల్లెట్ ఇడ్లీ, పొంగలి, మైసూర్ బజ్జీ, 4 రకాల పచ్చళ్ళు, పలహారముగా ఆహూతులందరికీ చికాగో ఆంధ్ర సంఘం (Chicago Andhra Association – CAA) వారు వడ్డించారు.

CAA ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల మొక్కలను (Plants) విరాళాల కొరకు అమ్మకానికి పెట్టారు. విరాళాల సేకరణ ద్వారా సమకూర్చిన ధనము పేదవారికి అందజేయనున్నారు. ఈ వేడుకల్లో తమిశ్ర కొంచాడ ఏర్పాటు చేసిన అందమైన ఫోటో బూత్ వద్ద (Photo Booth) తల్లులు తమ పిల్లలతో చక్కని ఫోటోలు తీయించుకున్నారు.

5k walk ను విజయవంతం చేయడానికి సహకరించిన స్పాన్సర్ల ను, ట్రస్టీలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు – సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అన్వితా పంచాగ్నుల, శ్రీనివాస్ పద్యాల, హేమంత్ తలపనేని, గీతిక మండల, తమిశ్ర కొంచాడ, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్ల; అందరికీ సంఘ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి (Swetha Kothapalli) ధన్యవాదాలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected