తానా 23వ మహాసభలు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన రవి పొట్లూరి కన్వీనర్ గా ఫిలడెల్ఫియా మహానగరంలో 2023 జులై 7, 8, 9 తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న సంగతి అందరికీ విదితమే. ఇందులో భాగంగా కన్వెన్షన్ కన్వీనర్ రవి పొట్లూరి సారధ్యంలోని తానా మిడ్ అట్లాంటిక్ జట్టు ఫిలడెల్ఫియా స్థానిక నాయకులు, వలంటీర్లతో ఆగష్టు 20న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది.
అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయంతో కమ్యూనిటీ మద్దతు సేకరించడం దీని ఉద్దేశం. ఎందుకంటే తానా మహాసభల బృహత్కార్యాన్ని విజయవంతం చేయాలంటే స్థానిక కమ్యూనిటి మద్దతు అవసరం. ఈ విషయంలో ఫిలడెల్ఫియా తానా చాప్టర్ మొదటి అడుగులోనే విజయవంతమయ్యింది.
ఫిలడెల్ఫియాలో ఈ బాంక్వెట్ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యి తమ మద్దతును తెలియజేయడం చూస్తుంటే ఫిలడెల్ఫియా తానా టీం రవి పొట్లూరి, సునీల్ కోగంటి, సతీష్ తుమ్మల, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సురేష్ యలమంచి, కోటి యాగంటి, మోహన్ మల్లా, గోపి వాగ్వల, జాన్ మార్క్, రాజేశ్వరి కొడాలి, రామ ముద్దన, సాంబయ్య కోటపాటి తదితరులు ప్రణాళికా బద్ధంగా పనిచేసినట్లు తెలుస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఆహ్వానితులందరితో మమేకమయ్యారు. సభని ఉద్దేశించి ప్రసంగిస్తూ తానా సేవాకార్యక్రమాలను వివరించారు. అలాగే సుమారు 22 సంవత్సరాల తర్వాత తానా మహాసభలను మళ్ళీ హోస్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఫిలడెల్ఫియా నగరాన్ని తానా మహాసభల చరిత్రలో అత్యున్నత స్థానంలో నిలబెడతారని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ సందర్భంగా ఫిలడెల్ఫియాలో 2001లో జరిగిన తానా 13వ మహాసభలలో పాలుపంచుకున్న హరనాథ్ దొడ్డపనేని, సరోజ సాగరం, మదన్ ఇనగంటి, సుధాకర్ పావులూరి మరియు శ్యాంబాబు వెలువోలు తదితరులను తానా మిడ్ అట్లాంటిక్ టీం ఘనంగా సన్మానించింది.
తానా 23వ మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ కార్యదర్శి సునీల్ కోగంటి సమన్వయపరిచిన ఈ కార్యక్రమాన్ని సతీష్ తుమ్మల స్వాగాతోపన్యాసంతో ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, పేరడీ పాటలు అందరినీ అలరించాయి. అపర్ణ వాగ్వల తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది.
అంజయ్య చౌదరి లావు తోపాటు తానా నుంచి జానీ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీ చౌదరి కోనంకి, దిలీప్ ముసునూరు, నాగరాజు నలజుల, కిరణ్ కొత్తపల్లి, శ్రీ అట్లూరి, సతీష్ చుండ్రు, మోహన్ మల్లా, లక్ష్మణ్ పర్వతనేని, శ్రీలక్ష్మి కులకర్ణి, వెంకట్ సింగు, శ్రీనివాస్ కోట, సుబ్బా ముప్ప, సాంబ నిమ్మగడ్డ, రామ ముద్దన, రావు యలమంచిలి, లక్ష్మి అద్దంకి, హరి మోటుపల్లి, పాపారావు ఉండవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ATA, TTA, NATA, NATS, TAGDV, PTA, TFAS, TASJ, HTA, NJTA వంటి వివిధ జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు ముజీబుర్ రెహ్మాన్, సురేష్ రెడ్డి వెంకన్నగారి, శ్రీనివాస్ కాశీమహంతు, మాధవరెడ్డి మోసర్ల, శర్మ సరిపల్లి, శ్రీనివాస్ భరతవరపు, సుధాకర్ తురగ, లక్ష్మి నరసింహారెడ్డి కొండా, ప్రసాద్ కునారపు, కిరణ్ గూడూరు లను తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేయడమే కాకుండా తమ మద్దతును తెలిపినందుకుగాను వేదికమీదికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
దెక్కన్ స్పైస్ రెస్టారెంట్ వారు అందించిన రుచికరమైన భోజనాన్ని ఆహ్వానితులందరూ ఆస్వాదించారు. సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురు స్వాతి గుండపునీడి, ఆడియో సహకారం అందించిన మూర్తి నూతనపాటి, ఆహ్వానితులు ఇలా అందరికీ నిర్వాహకులు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన తానా మిడ్ అట్లాంటిక్ టీంని తానా అధక్షులు అంజయ్య చౌదరి లావు అభినందించారు.