Connect with us

Conference

నవంబర్ 5న తానా 23వ మహాసభల గ్రాండ్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న విషయం అందరికీ విదితమే. ఇందులో భాగంగా తానా బృందం ఆగష్టు 5న కన్వెన్షన్ సెంటర్‌ ని కూడా సందర్శించడం జరిగింది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ తానా మహాసభలు (TANA Conference) పొట్లూరి రవి కన్వీనర్ గా లావు అంజయ్య చౌదరి అధ్యక్షతన ఘనంగా నిర్వహించనున్నారు. ముందుగా నవంబర్ 5న ఈ మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్ (Kick Off & Fundraiser Banquet) నిర్వహిస్తున్నారు.

నవంబర్ 5 శనివారం రోజు తానా కార్యవర్గసభ్యులు, బోర్డు సభ్యులు మరియు ఫౌండేషన్ సభ్యుల సమావేశాలుంటాయి. అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి వార్మినిస్టర్ లోని ది ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్లో కిక్ ఆఫ్ కం ఫండ్రైజర్ బ్యాంక్వెట్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగాప్రముఖ తెలుగు సినీ గాయని గీత మాధురి (Geetha Madhuri) లైవ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు వారాల క్రితమే అందరినీ ఆహ్వానిస్తూ పర్సనల్ ఫోన్ కాల్స్, ఈవైట్, వన్ ఆన్ వన్ టెక్స్ట్ మెసేజెస్ అందరికీ వెళ్లాయి. కోవిడ్ (COVID) కారణంగా 2021 మహాసభలు రద్దవడంతో సుమారు 4 సంవత్సరాల తర్వాత వచ్చే మహాసభలు కావడంతో ఇటు తానా సభ్యులు అటు తెలుగువారందరూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పటికే అమెరికాలోని పలు నగరాల నుంచి తానా నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ కి హాజరయ్యేలా ఫ్లైట్ మరియు హోటెల్ టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇండియాలో పెద్ద ఎత్తున నిర్వహించే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలకు ముందుగా ఈ కన్వెన్షన్ కిక్ ఆఫ్ & ఫండ్రైజర్ బ్యాంక్వెట్ ఈవెంట్లో తానా అతిరథ మహారథులందరూ కలిసే అవకాశం ఉంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected